Sajjala Ramakrishna Reddy: జగన్ కు చంద్రబాబు విసిరిన సవాల్ ఒక ఏడుపులా ఉంది: సజ్జల

Sajjala Slams Chandrababus Challenge to Jagan as a Cry
  • జగన్ అంటే భయమా అని ప్రశ్నించిన సజ్జల
  • మీ మంద బలంతో ప్రతిపక్ష గొంతు నొక్కుతారా అని ప్రశ్న
  • ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడవడం చంద్రబాబు ఘనత అంటూ ఎద్దేవా
అసెంబ్లీకి హాజరుకావాలంటూ వైసీపీ అధినేత జగన్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు విసిరిన సవాల్ ఒక ఏడుపులా ఉందని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఎద్దేవా చేశారు. చంద్రబాబుకు నిజంగా దమ్ము, ధైర్యం ఉంటే ముందుగా వైఎస్ జగన్‌కు ప్రతిపక్ష హోదా కల్పించాలని ఆయన సవాల్ విసిరారు. ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి ప్రభుత్వం ఎందుకు భయపడుతోందని ఆయన సూటిగా ప్రశ్నించారు.

ఈ సందర్భంగా సజ్జల మాట్లాడుతూ, "ప్రతిపక్ష హోదా ఇస్తే ప్రజల తరఫున మా గొంతు వినిపిస్తాం. కానీ మీకున్న మంద బలంతో మా గొంతు నొక్కాలని చూస్తున్నారు. అందుకే జగన్‌కు ఆ హోదా ఇవ్వడం లేదు. మీరు ఆ హోదా ఇస్తే చాలు, మీ అందరికీ సమాధానం చెప్పడానికి జగన్ ఒక్కరే సరిపోతారు" అని వ్యాఖ్యానించారు. కేవలం మీడియా సమావేశంలో మాట్లాడితేనే సమాధానం చెప్పలేక టీడీపీ నేతలు దూషణలకు దిగుతున్నారని ఆయన మండిపడ్డారు.

చంద్రబాబు పాలనపై కూడా సజ్జల తీవ్ర విమర్శలు చేశారు. "ముప్పై ఏళ్లు సీఎంగా చేశానని చంద్రబాబు చెప్పుకుంటారు. కానీ ఆయన పేరు చెప్పగానే ఎన్టీఆర్‌ను ఎలా వెన్నుపోటు పొడిచారన్నదే గుర్తుకొస్తుంది. ఆ వెన్నుపోటుపై ఆయన సంబరాలు చేసుకోవాలి" అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కుటుంబ సభ్యులను, కోర్టులను చంద్రబాబు ఎలా మేనేజ్ చేశారో అందరికీ తెలుసని ఆరోపించారు. స్పీకర్‌ను 'బూతుల్లో ఎక్స్‌పర్ట్' అని అభివర్ణించిన సజ్జల, ఆయన ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని అన్నారు.

ప్రస్తుత ప్రభుత్వ పాలనలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సజ్జల ఆవేదన వ్యక్తం చేశారు. "రాష్ట్రంలో యూరియా కొరత తీవ్రంగా ఉంది. యూరియా కోసం రైతులు గంటల తరబడి చెప్పులు లైన్‌లో పెట్టి ఎదురుచూస్తున్నారు. చివరికి సీఎం సొంత నియోజకవర్గం కుప్పంలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది" అని విమర్శించారు. చంద్రబాబు ప్రజలను మోసం చేశారని, అందుకే ప్రజల్లోకి వెళ్లాలంటే భయపడుతున్నారని అన్నారు. ఆయన కార్యక్రమాలన్నీ ఈవెంట్ మేనేజ్‌మెంట్‌ను తలపిస్తున్నాయని విమర్శించారు. ప్రజల్లోకి వెళితే చంద్రబాబును వెంటపడి కొడతారని సజ్జల హెచ్చరించారు.
Sajjala Ramakrishna Reddy
Chandrababu Naidu
YS Jagan
YCP
TDP
Andhra Pradesh politics
opposition leader
assembly
urea shortage
Kuppam

More Telugu News