Jupudi Prabhakar: సాక్షి కార్యాలయంపై అర్ధరాత్రి పోలీసులతో దాడి చేయించారు: జూపూడి ప్రభాకర్

Jupudi Prabhakar slams police raid on Sakshi office
  • డీఎస్పీల ప్రమోషన్లలో అక్రమాలపై వార్త రాసినందుకు వేధిస్తున్నారన్న జూపూడి
  • సాక్షి ఎడిటర్‌పై అక్రమంగా కేసు బనాయించారని మండిపాటు
  • ప్రభుత్వ తీరు నియంతృత్వాన్ని తలపిస్తోందని తీవ్ర వ్యాఖ్యలు
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం మీడియా స్వేచ్ఛను కాలరాస్తోందని, కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జూపూడి ప్రభాకర్ తీవ్రస్థాయిలో విమర్శించారు. డీఎస్పీల ప్రమోషన్లలో జరిగిన అవకతవకలపై వార్తలు ప్రచురించినందుకే ‘సాక్షి’ మీడియా కార్యాలయంపై అర్ధరాత్రి పోలీసులతో దాడి చేయించారని ఆయన ఆరోపించారు. 

"పోలీసుల మేలు కోరుతూ వార్త రాస్తే, అదే పోలీసులను అర్ధరాత్రి సాక్షి కార్యాలయానికి పంపి వీరంగం సృష్టించారు. వార్తలు రాసినందుకు దాడులు చేస్తారా?" అని జూపూడి ప్రశ్నించారు. ఇది ప్రభుత్వ నియంతృత్వానికి నిదర్శనమని ఆయన వ్యాఖ్యానించారు. మొదట వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించిన ప్రభుత్వం, ఇప్పుడు సాక్షి మీడియాను లక్ష్యంగా చేసుకుందని అన్నారు. "దేశానికి స్వాతంత్ర్యం అర్ధరాత్రి వస్తే, కూటమి ప్రభుత్వం అదే అర్ధరాత్రి పత్రికా స్వేచ్ఛను హరించింది" అని ఆయన ధ్వజమెత్తారు.

సాక్షి ఎడిటర్ ధనుంజయ రెడ్డిపై అక్రమంగా కేసు నమోదు చేయించారని జూపూడి ఆరోపించారు. గతంలో మే 8న కూడా ఆయన ఇంట్లో అక్రమంగా సోదాలు నిర్వహించారని గుర్తుచేశారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే భయభ్రాంతులకు గురిచేయాలని చూస్తున్నారని, ఇది అప్రజాస్వామికమని అన్నారు. "ప్రభుత్వం వీధి రౌడీలా వ్యవహరిస్తే చూస్తూ ఊరుకోబోం. మానవ హక్కులకు, ప్రజాస్వామ్యానికి సంకెళ్లు వేయాలని చూస్తే కుదరదు" అని జూపూడి ప్రభాకర్ హెచ్చరించారు. 
Jupudi Prabhakar
Sakshi office raid
Andhra Pradesh government
TDP government
YS Jagan Mohan Reddy
Media freedom AP
Sakshi editor Dhanunjaya Reddy
Police raids AP
Political vendetta
YSRCP

More Telugu News