Detective Ujwalan: తెలుగులో అందుబాటులోకి వస్తున్న మలయాళ థ్రిల్లర్!
- మలయాళంలో వచ్చిన 'డిటెక్టివ్ ఉజ్వలన్'
- మే 23వ తేదీన థియేటర్లలో విడుదల
- జులై 11 నుంచి 'నెట్ ఫ్లిక్స్'లో స్ట్రీమింగ్
- తెలుగులో ఈ నెల 12 నుంచి 'లయన్స్ గేట్ ప్లే'లో!
- వరుస హత్యల చుట్టూ తిరిగే కథ
మలయాళంలో థ్రిల్లర్ జోనర్ కి సంబంధించిన కథలు ఎక్కువగా తెరకెక్కుతూ ఉంటాయి. అలా రూపొందిన మలయాళ సినిమాలకు ఓటీటీ ఫ్లాట్ ఫామ్ వైపు నుంచి మంచి డిమాండ్ ఉంది. ఈ విషయాన్నీ మరోసారి నిరూపించిన సినిమానే 'డిటెక్టివ్ ఉజ్వలన్'. సోఫియా పాల్ నిర్మించిన ఈ సినిమాకి, ఇంద్రనీల్ గోపాలకృష్ణన్ - రాహుల్ దర్శకత్వం వహించారు. ఈ ఏడాది మే 23వ తేదీన థియేటర్లలో ఈ సినిమాను విడుదల చేశారు.
జులై 11 నుంచి ఈ సినిమా 'నెట్ ఫ్లిక్స్'లో మలయాళంలోనే స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా మెయిన్ లైన్ ఏమిటనేది తెలుసుకున్న తెలుగు ప్రేక్షకులు తెలుగులోను ఈ సినిమా అందుబాటులోకి వస్తే బాగుండేదని అనుకున్నారు. అలాంటి ప్రేక్షకుల నిరీక్షణ త్వరలో ఫలించబోతోంది. ఈ నెల 12 నుంచి 'లయన్స్ గేట్ ప్లే' ఓటీటీలో తెలుగులోను అందుబాటులోకి రానుంది. ధ్యాన్ శ్రీనివాసన్ .. సిజూ విల్సన్ .. రోని డేవిడ్ రాజ్ .. కొట్టాయం నజీర్ ఇతర ముఖ్యమైన పాత్రలలో నటించనున్నారు.
కథ విషయానికి వస్తే, 1960లలో ఈ కథ మొదలవుతుంది. కేరళ ప్రాంతంలోని ఒక మారుమూల గ్రామం అది. అక్కడ చిన్న చిన్న దొంగతనాలు జరుగుతూ ఉంటే కనిపెట్టే డిటెక్టివ్ గా ఉజ్వలన్ ఉంటాడు. ప్రశాంతంగా ఉండే ఆ పల్లెలో ఒక్కసారిగా వరుస హత్యలు మొదలవుతాయి. ఈ విషయంలో అక్కడి పోలీసులు ఉజ్వలన్ సాయం కోరతారు. అప్పుడు అతను ఏం చేస్తాడు? హత్యలకు కారకులు ఎవరు? అనేది కథ. కామెడీ టచ్ తో సాగే ఈ మిస్టరీ థ్రిల్లర్ ను ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు.