Layoffs: మీ ఉద్యోగం డేంజర్ లో ఉందని చెప్పే 8 సంకేతాలివే..!

Layoff Warning Signs 8 Signals Your Job Is In Danger
  • క్వాల్ కామ్ మాజీ ఉద్యోగి వెల్లడి
  • పెళ్లి అయిన 15 రోజులకే తన ఉద్యోగం పోయిందన్న మహిళ
  • ఈ సంకేతాలు కనిపిస్తే జాగ్రత్త పడాల్సిందే
కార్పొరేట్ కంపెనీలు ఇటీవల సామూహిక తొలగింపులు చేపడుతున్న విషయం తెలిసిందే. పెద్ద కంపెనీలో ఉద్యోగం, నెలనెలా భారీ మొత్తంలో అందుకుంటున్న జీతం.. ఇంకేం ఇంకేం కావాలే అని పాడుకోవడానికి లేదని ఈ మాస్ లేఆఫ్ లు తెలియజేస్తున్నాయి. ఉద్యోగం ఎప్పుడు ఉంటుందో, ఎప్పుడు ఊడుతుందో తెలియని పరిస్థితి నెలకొంది.

ఉన్నట్టుండి ఒకరోజు సడెన్ గా మీ టేబుల్ మీద పింక్ స్లిప్ కనిపించవచ్చు. తనను కూడా ఇలాగే సడెన్ గా ఇంటికి పంపించారని క్వాల్ కామ్ కంపెనీ మాజీ మహిళా ఉద్యోగి ఒకరు వెల్లడించారు. పెళ్లి అయిన 15 రోజులకే ఉద్యోగం ఊడడంతో పెళ్లి చేసుకున్న ఆనందం ఆవిరైందని వాపోయారు. అయితే, మీ ఉద్యోగం డేంజర్ లో ఉందనే సంకేతాలు కంపెనీ వర్గాలు ముందునుంచే వెల్లడిస్తాయని, వాటిని గుర్తించి జాగ్రత్త పడాలని ఆమె సూచిస్తున్నారు.

ఆ సంకేతాలు ఏంటంటే..
  • వర్క్ లోడ్ పెరుగుతుంది.. మిమ్మల్ని తొలగించాలని మీ బాస్ నిర్ణయించుకుంటే.. ఉన్నట్టుండి మీ వర్క్ లోడ్ పెరిగిపోతుంది. మీపై కంపెనీ ఆధారపడకూడదనే ఉద్దేశంతో మీరు చేయాల్సిన పనులన్నీ పూర్తి చేయించే ప్రయత్నమే ఇది.
  • ఆఫీసులో రూమర్లు.. మీపై వేటుపడబోతుందనే విషయం హెచ్ఆర్ సిబ్బంది మెల్లిగా లీక్ చేస్తారు. మీ సహోద్యోగులకు తెలిసిపోతుంది. వారు చెప్పినా మీరు నమ్మలేరు.
  • ఆఫీసు మీటింగ్ లలో మిమ్మల్ని ఉద్దేశపూర్వకంగా దూరం పెడతారు.
  • బాస్ ప్రవర్తనలో మార్పు.. గతంలో లాగా బాస్ మీతో మాట్లాడలేరు. నేరుగా మీ కళ్లల్లోకి చూడకుండా పక్కలకు చూస్తూ మాట్లాడడం, పొడి పొడి సమాధానాలు, డిఫెన్సివ్ టోన్.. వంటి లక్షణాలు కనిపించాయా మీ ఉద్యోగం ఊడబోతున్నట్లే లెక్క!
  • ఆఫీసులో ఒకే పనిని ఇద్దరు ఉద్యోగులకు అప్పగించి చేయిస్తున్నారా.. సందేహమే అక్కర్లేదు ఆ ఇద్దరిలో ఒకరు ఇంటికి వెళ్లబోతున్నట్లే!
  • మహిళా ఉద్యోగులు ఆఫీసులో శుభవార్త (పెళ్లి, తల్లికాబోతున్నా.. వంటివి) చెప్పారంటే వారికి త్వరలో దుర్వార్త ఎదురవుతుందనేది ఖాయం
  • మార్కెట్లో మీ కంపెనీకి పోటీ కంపెనీ ఉద్యోగులను తొలగిస్తోందా.. మీ ఆఫీసులోనూ తొలగింపులపై చర్చ జరుగుతుంది.
  • హెచ్ ఆర్ విభాగం నుంచి తరచూ పిలుపు.. పెద్దగా అవసరం లేకున్నా హెచ్ఆర్ నుంచి తరచూ పిలుపు వస్తోందంటే త్వరలో మిమ్మల్ని ఇంటికి సాగనంపబోతున్నామని పరోక్షంగా చెప్పడమే!
Layoffs
Job loss
Layoff signs
Corporate layoffs
Job security
Pink slip
Employee warning signs
Mass layoffs
Job market

More Telugu News