Ramesh Ghengat: పెళ్లి సంబంధం మాట్లాడదామని పిలిచి కొట్టి చంపారు.. ముంబైలో దారుణం
- కూతురు ప్రేమకు అడ్డు చెప్పిన తల్లిదండ్రులు
- పారిపోయి పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైన కూతురు
- పెళ్లి మాటలు మాట్లాడుకుందమని ప్రియుడిని ఇంటికి పిలిచి దాడి
మహారాష్ట్రలోని పూణేలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ప్రేమ పేరుతో తమ అమ్మాయిని వలలో వేసుకున్నాడనే కోపంతో ఓ కుటుంబం ఘోరానికి పాల్పడింది. పెళ్లి మాటలు మాట్లాడుకుందామని కూతురు ప్రియుడిని ఇంటికి పిలిచి కుటుంబం సభ్యులు మూకుమ్మడిగా దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన యువకుడిని ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మరణించాడు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పింప్రి చించ్వాడ్ లోని సాంఘ్వి ఏరియాకు చెందిన ఓ యువతి స్థానిక యువకుడు రమేశ్ ఘెంగాత్ ను ప్రేమించింది. ఈ విషయం తెలిసి యువతి కుటుంబ సభ్యులు అభ్యంతరం తెలిపారు. రమేశ్ పై రేప్ కేసు నమోదైందని, పోస్కో కేసులోనూ నిందితుడని కూతురుకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయినా కూతురు పట్టువిడవకపోవడంతో గత్యంతరం లేక పెళ్లికి ఒప్పుకున్నారు. పెళ్లి కుదుర్చుకునేందుకు రమ్మంటూ రమేశ్ కుటుంబాన్ని ఇంటికి ఆహ్వానించారు.
తల్లిదండ్రులను వెంటబెట్టుకుని వచ్చిన రమేశ్ ను యువతి కుటుంబ సభ్యులు నిలదీశారు. ప్రేమ పేరుతో తమ కూతురును వలలో వేసుకున్నాడని ఆరోపించారు. ఈ విషయంపై మాటామాటా పెరగడంతో కోపోద్రిక్తులైన యువతి కుటుంబ సభ్యులు రమేశ్ ను గదిలోకి లాక్కెళ్లి చితకబాదారు. తీవ్ర గాయాలతో రమేశ్ స్పృహ తప్పడంతో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ రమేశ్ మరణించాడు. రమేశ్ తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. యువతి కుటుంబ సభ్యులు 9 మందిని అరెస్టు చేశారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారని, వారికోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.