Mohit Sidhapara: సోషల్ మీడియాలో బ్లాక్ చేసిందన్న కోపంతో మాజీ ప్రేయసి గొంతు కోసిన యువకుడు

Mohit Sidhapara arrested for girlfriend murder in Bhuj
  • గుజరాత్ రాష్ట్రం గాంధీధామ్‌లోని భరత్‌నగర్‌లో ఘటన
  • పక్కింటి యువతిపై కత్తితో దాడి చేసిన మోహిత్ సిద్దపారా
  • ఆసుపత్రిలో చికిత్స పొందుతూ యువతి మృతి
  • నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు  
గుజరాత్‌లోని భుజ్‌లో జరిగిన దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సోషల్ మీడియాలో తనను బ్లాక్ చేసిందన్న కోపంతో ఓ యువకుడు తన పక్కింటి అమ్మాయిని (మాజీ ప్రియురాలు) హత్య చేశాడు. 

పోలీసుల కథనం ప్రకారం గాంధీధామ్‌లోని భరత్‌నగర్‌కు చెందిన 20 ఏళ్ల యువతి భుజ్‌లోని ఓ హాస్టల్‌లో ఉండి బీసీఏ చదువుతోంది. ఆమె ఇంటి పక్కనే ఉండే మోహిత్ సిద్ధపారా (22)తో గతంలో ప్రేమ సంబంధం ఉండేదని, అయితే కొన్ని అభిప్రాయ భేదాల వల్ల విడిపోయినట్టు తెలుస్తోంది. తల్లి సలహాతో యువతి మోహిత్‌ను సోషల్ మీడియా ప్లాట్‌ఫారాల్లో బ్లాక్ చేసింది.

దీనిపై కక్ష పెంచుకున్న మోహిత్ తన స్నేహితుడితో కలిసి ఆమె కళాశాల సమీపానికి వెళ్లాడు. సంస్కార్ పాఠశాల సమీపంలో ఆమెను అడ్డగించి, సోషల్ మీడియాలో ఎందుకు బ్లాక్ చేశావంటూ గొడవకు దిగాడు. యువతి మరోసారి తనను కలవకూడదని తెగేసి చెప్పడంతో మోహిత్ దాడి చేశాడు.

వెంటనే మోహిత్ కత్తితో యువతి గొంతు కోశాడు. అడ్డుకునేందుకు వచ్చిన స్నేహితుడిని కూడా గాయపరిచాడు. తీవ్రంగా గాయపడిన యువతి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరుసటిరోజు మరణించింది.

ఈ దారుణ ఘటనపై కచ్ ప్రాంతంలో తీవ్ర ఆందోళన వ్యక్తమైంది. మానవత్వాన్ని మరిచిపోయేలా జరిగిన ఈ హత్యపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు వెంటనే స్పందించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతనిపై హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 
Mohit Sidhapara
Bhuj Gujarat
social media block
love affair
murder case
BCA student
Kutch
crime news
hate crime

More Telugu News