Nandamuri Balakrishna: రజనీకాంత్ నోట బాలకృష్ణ డైలాగ్... లవ్యూ బాలయ్య అంటూ స్పెషల్ విషెస్

Rajinikanth Praises Balakrishna on 50 Years in Film Industry
  • నటసింహం బాలకృష్ణకు సూపర్ స్టార్ రజనీకాంత్ అభినందనలు
  • సినీ రంగంలో 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేక వీడియో
  • బాలయ్య ఎక్కడుంటే అక్కడ పాజిటివిటీ, సంతోషం ఉంటాయన్న తలైవా
  • పంచ్ డైలాగులు బాలకృష్ణ చెబితేనే బాగుంటాయని ప్రశంస
  • బాలయ్యకు పోటీ బాలయ్యేనంటూ ఆసక్తికర వ్యాఖ్యలు
నందమూరి బాలకృష్ణ సినీ ప్రయాణంలో 50 వసంతాలు పూర్తి చేసుకున్న అరుదైన సందర్భంగా, సూపర్ స్టార్ రజనీకాంత్ ఆయనపై ప్రశంసల వర్షం కురిపించారు. బాలకృష్ణ ఒక పాజిటివ్ శక్తి అని, ఆయన ఉన్నచోట సంతోషం, నవ్వులు వెల్లివిరుస్తాయని కొనియాడారు. ఈ మేరకు తన శుభాకాంక్షలను ఒక ప్రత్యేక వీడియో సందేశం ద్వారా పంచుకున్నారు.

ఈ వీడియోలో రజనీకాంత్ మాట్లాడుతూ.. "బాలయ్య అంటేనే పాజిటివిటీ. ఆయనలో కొంచెం కూడా నెగెటివిటీ కనిపించదు. 'ఫ్లూటు జింక ముందు ఊదు.. సింహం ముందు కాదు', 'కత్తితో కాదురా కంటి చూపుతో చంపేస్తా' వంటి పవర్‌ఫుల్ డైలాగులు కేవలం బాలకృష్ణ చెబితేనే అందంగా ఉంటాయి" అని ప్రశంసించారు. బాలకృష్ణకు పోటీ మరెవరో కాదని, ఆయనకు ఆయనే పోటీ అని రజనీకాంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

బాలకృష్ణ సినిమా వస్తుందంటే కేవలం ఆయన అభిమానులే కాకుండా, సాధారణ ప్రేక్షకులు కూడా థియేటర్లకు వస్తారని, అదే ఆయనకున్న బలమని తెలిపారు. "సినిమా పరిశ్రమలోకి వచ్చి 50 ఏళ్లు పూర్తి చేసుకోవడం గొప్ప విషయం. ఇందుకు నా హృదయపూర్వక అభినందనలు. ఆయన మరో 25 ఏళ్లు ఇలాగే నటిస్తూ 75 ఏళ్ల మైలురాయిని కూడా అందుకోవాలి. సంతోషంగా ఉండాలి. లవ్యూ బాలయ్య" అంటూ రజనీకాంత్ తన సందేశాన్ని ముగించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 
Nandamuri Balakrishna
Balakrishna
Rajinikanth
Tollywood
50 Years
Film Industry
Special Wishes
Telugu Cinema
Nandamuri
Anniversary

More Telugu News