Revanth Reddy: బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు, గవర్నర్ కోటా ఎమ్మెల్సీలపై తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
- రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం
- రిజర్వేషన్లపై గత ప్రభుత్వం విధించిన పరిమితిని ఎత్తివేస్తూ జీవో జారీ చేయాలని నిర్ణయం
- కోదండరామ్, అజారుద్దీన్‌లను ఎమ్మెల్సీలుగా ఎంపిక చేయాలని కేబినెట్ నిర్ణయం
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై తెలంగాణ మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. పంచాయతీల్లో రిజర్వేషన్‌పై గత ప్రభుత్వం విధించిన పరిమితిని ఎత్తివేస్తూ జీవో జారీ చేయాలని నిర్ణయించింది. దీని ఆధారంగా ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ మంత్రివర్గం సమావేశమై పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.
గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా కోదండరామ్, అజారుద్దీన్‌లను ఎంపిక చేయాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయించింది. గతంలో అమీర్ ఖాన్‌కు అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, ఈసారి ఆయన స్థానంలో అజారుద్దీన్‌కు అవకాశం ఇచ్చింది. ఈ మేరకు కోదండరామ్, అజారుద్దీన్‌ల పేర్లను సిఫార్సు చేస్తూ గవర్నర్‌కు పంపించింది.