Mike Weirsky: విడాకులిచ్చిన భార్యకు షాక్.. భర్తకు జాక్‌పాట్!

Lottery Jackpot for Mike Weirsky After Wifes Divorce
  • ఉద్యోగం లేదనే కారణంతో విడాకులు ఇచ్చిన భార్య
  • విడాకులు ఇచ్చిన కొన్ని రోజులకే భర్తకు జాక్‌పాట్
  • రూ. 2,280 కోట్ల లాటరీ గెలుచుకున్న వ్యక్తి 
అదృష్టం ఎప్పుడు, ఎవరిని, ఎలా వరిస్తుందో చెప్పలేం. నిన్నటి వరకు నిరుద్యోగిగా ఉన్న వ్యక్తి, రాత్రికి రాత్రే వేల కోట్లకు అధిపతి కావచ్చు. అమెరికాలోని న్యూజెర్సీకి చెందిన మైక్ వీర్‌న్కీ జీవితంలో సరిగ్గా ఇదే జరిగింది. ఉద్యోగం లేదన్న కారణంతో భార్య విడాకులు ఇచ్చిన కొద్ది రోజులకే, అతడికి ఏకంగా రూ. 2,280 కోట్ల లాటరీ తగలడం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

వివరాల్లోకి వెళితే, మైక్ వీర్‌న్కీకి గత 15 ఏళ్ల క్రితం వివాహమైంది. అయితే, అతడికి సరైన ఉద్యోగం లేదు. కనీస అవసరాలు కూడా తీర్చడం లేదని, బయటకు తీసుకువెళ్లడం లేదని భార్య తరచూ గొడవపడేది. పదిహేనేళ్ల పాటు ఈ గొడవలు కొనసాగాయి. చివరికి విసిగిపోయిన ఆమె... ఇక నీతో కలిసి జీవించలేను అంటూ విడాకులు తీసుకుని వెళ్లిపోయింది.

భార్య వదిలి వెళ్లిన తర్వాత మైక్ జీవితం ఊహించని మలుపు తిరిగింది. అతడు కొనుగోలు చేసిన ఓ లాటరీ టికెట్‌కు భారీ జాక్‌పాట్ తగిలింది. దాని విలువ అక్షరాలా 273 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో దాదాపు రూ. 2,280 కోట్లు). దీంతో అతడు రాత్రికి రాత్రే కోటీశ్వరుడుగా మారిపోయాడు.

ఈ వార్త కాస్తా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యింది. నెటిజన్లు దీనిపై ఆసక్తికరంగా స్పందిస్తున్నారు. "విడాకులు ఒక జాక్‌పాట్, లాటరీ రెండో జాక్‌పాట్.. నువ్వు డబుల్ జాక్‌పాట్ కొట్టావు బ్రదర్" అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. "ఇప్పుడు ఈ విషయం తెలిసి నీ మాజీ భార్య కచ్చితంగా తిరిగి వస్తుంది చూడు" అని మరికొందరు జోస్యం చెబుతున్నారు. మొత్తానికి, మైక్ వీర్‌న్కీ కథ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. 
Mike Weirsky
New Jersey Lottery
Lottery winner
Divorce settlement
Jackpot winner
Viral news
273 million dollars
Unexpected wealth
Ex wife

More Telugu News