Ramyakrishna: కేపీహెచ్‌బీలో భర్త గొంతు కోసి చంపిన భార్య.. ఆపై ఆత్మహత్యాయత్నం

Wife Murders Husband in KPHB then Attempts Suicide
  • గొంతుకోసుకున్న మహిళను ఆసుపత్రికి తరలించిన ఇరుగుపొరుగు
  • ఐసీయూలో చికిత్స.. విషమంగానే ఉందంటున్న వైద్యులు
  • అప్పుల బాధ భరించలేక దారుణ నిర్ణయం
అప్పుల బాధ భరించలేక దంపతులు దారుణ నిర్ణయం తీసుకున్నారు. ఇద్దరూ కలిసి చనిపోవాలని నిశ్చయించుకున్నారు. ఇంట్లో కూరగాయలు తరిగే కత్తితో భర్త గొంతు కోసి చంపేసిన భార్య.. అదే కత్తితో తన గొంతు కోసుకుంది. ఈ విషాదకర ఘటన హైదరాబాద్ లోని కేపీహెచ్ బీలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కేపీహెచ్ బీలో నివాసం ఉంటున్న భార్యాభర్తలు రామకృష్ణ, రమ్యకృష్ణలు అప్పుల పాలయ్యారు. ఇటీవల అప్పు ఇచ్చిన వాళ్ల ఒత్తిడి పెరిగింది. అప్పు చెల్లించే మార్గం లేకపోవడంతో భార్యభర్తలు కఠిన నిర్ణయం తీసుకున్నారు.

ఇంట్లో ఆత్మహత్యకు ప్రయత్నించారు. తొలుత భర్త గొంతు కోసి చంపిన రమ్యకృష్ణ.. తర్వాత అదే కత్తితో తన గొంతు కోసుకుంది. చుట్టుపక్కల వారు గమనించి ఇద్దరినీ ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే రామకృష్ణ మరణించాడని వైద్యులు తెలిపారు. రమ్యకృష్ణను ఐసీయూలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. గాయం తీవ్రత ఎక్కువగా ఉండడం, అధికంగా రక్తస్రావం కావడంతో రమ్యకృష్ణ పరిస్థితి విషమంగా ఉందని వెల్లడించారు. కాగా, రామకృష్ణ మృతిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు.
Ramyakrishna
KPHB
Hyderabad
Suicide attempt
Debt issues
Husband murdered
Wife suicide
Crime news
Telangana

More Telugu News