Footage Movie: ఓటీటీలో మరో మలయాళం థ్రిల్లర్!

Footage Movie Update
  • మలయాళంలో రూపొందిన 'ఫుటేజ్'
  • కోవిడ్ సమయంలో నడిచే కథ 
  • ఉత్కంఠను రేకెత్తించే ఫారెస్టు సన్నివేశాలు
  • ఓటీటీ హక్కులు సన్ నెక్స్ట్ చేతికి  
  • సెప్టెంబర్ 5వ తేదీ నుంచి స్ట్రీమింగ్

ఓటీటీలలో విశేషమైన ఆదరణ పొందుతున్న జోనర్ ఏదైనా ఉందంటే, అది థ్రిల్లర్ జోనర్ అనే చెప్పాలి. ఏ క్షణంలో ఏం జరుగుతుందో .. కథ ఏ మలుపు తిరుగుతుందో .. అనే ఒక కుతూహలం ఈ జోనర్లోనే కావలసినంత దొరుకుతూ ఉంటుంది. అందువల్లనే ఈ తరహా కంటెంట్ ను ఎక్కువమంది చూస్తూ ఉంటారు. అలా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఈ జోనర్ ను టచ్ చేసిన మలయాళ సినిమాగా 'ఫుటేజ్'  కనిపిస్తుంది.

థ్రిల్లర్ జోనర్ కి సంబంధించిన కథలతో ఆడియన్స్ ను ఉక్కిరిబిక్కిరి చేయడంలో మలయాళ దర్శకులకు మంచి నైపుణ్యం ఉంది. అందువలన మలయాళ సినిమాకు మంచి క్రేజ్ కూడా వచ్చింది. అలా క్రితం ఏడాది ఆగస్టు 23న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమాగా 'ఫుటేజ్' కనిపిస్తుంది. మంజు వారియర్ .. విశాఖ్ .. గాయత్రి ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమాకి, సైజు శ్రీధరన్ దర్శకత్వం వహించాడు.

అలాంటి ఈ సినిమాను ఇప్పుడు 'సన్ నెక్స్ట్' ద్వారా ఆడియన్స్ ను పలరించడానికి రెడీ అవుతోంది. సెప్టెంబర్ 5వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఒక యువజంట తమ పక్కింటి ఆవిడ కదలికలపై నిఘా పెడుతుంది. ఆ ప్రయత్నంలో వాళ్లకి దొరికిన ఫుటేజ్, మరిన్ని అనుమానాలను రేకెత్తిస్తుంది. ఆ మిస్టరీని ఛేదించడానికి వారు అడవికి వెళతారు. అక్కడ వాళ్లకి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి? ఎటువంటి చిక్కుల్లో పడతారు? అనేది కథ. 

Footage Movie
Manju Warrier
Malayalam Thriller
OTT Thriller Movies
Sun NXT
Vishakh
Gayathri
Malayalam Cinema
Size Sridharan

More Telugu News