Maganti Gopinath: తెలంగాణ అసెంబ్లీలో మాగంటి గోపికి సంతాపం.. రేపటికి వాయిదా

Telangana Assembly Adjourned to Tomorrow Condolences to Maganti Gopi
  • ఈరోజు ప్రారంభమైన అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు
  • రేపటికి వాయిదా పడ్డ శాసనసభ, మండలి
  • కాసేపట్లో జరగనున్న బీఏసీ సమావేశం
తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు రేపటికి వాయిదా పడ్డాయి. రేపు ఉదయం 9 గంటలకు అసెంబ్లీ ప్రారంభం అవుతుంది. కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై ఘోష్ కమిటీ ఇచ్చిన నివేదికపై అసెంబ్లీలో చర్చించబోతున్నారు. ఈ చర్చ ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై ప్రభుత్వం నిర్ణయించనుంది. 

కాసేపట్లో బీఏసీ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో అసెంబ్లీ సమావేశాలను ఎన్ని రోజులు నిర్వహించాలి? ఏయే అంశాలపై చర్చించాలి? అనేదానిపై నిర్ణయం తీసుకోనున్నారు. శాసనమండలి కూడా రేపటికి వాయిదా పడింది. మరోవైపు, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతిపై అసెంబ్లీలో సంతాపం ప్రకటించారు.
Maganti Gopinath
Telangana Assembly
Kaleshwaram Project
Gosh Committee Report
Telangana Politics
Assembly Sessions
BRS MLA
Telangana News
Telangana Government

More Telugu News