: కూర కోసం గొడవ.. కొయ్యూరులో తండ్రిని చంపిన కొడుకు
- తాగి వచ్చి తల్లిని వేధిస్తుండడంతో కోపం పట్టలేక తండ్రిపై దాడి
- కర్ర పీటతో తలపై మోదడంతో అక్కడికక్కడే మరణించిన తండ్రి
- పరారీలో ఉన్న కొడుకు కోసం పోలీసుల గాలింపు
మద్యం మత్తులో తల్లితో గొడవ పడుతున్న తండ్రిని కొడుకు అడ్డుకున్నాడు. వద్దని వారించినా తండ్రి వినకపోవడంతో కోపం పట్టలేకపోయాడు. పక్కనే ఉన్న కర్ర పీటతో తండ్రి తలపై మోదాడు. దీంతో తండ్రి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. భయంతో కొడుకు పరారయ్యాడు. కూర కోసం మొదలైన ఈ గొడవలో చివరకు ఓ ప్రాణం పోయింది. అల్లూరి జిల్లా కొయ్యూరు మండలం మఠం బొడ్డు మామిడి లంక గ్రామంలో ఈ దారుణం చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన బుడ్డయ్య, లక్ష్మమ్మ దంపతులు. వారి కుమారుడు లోవరాజు. కూలి పనులు చేసే బుడ్డయ్య మద్యానికి బానిసయ్యాడు. రోజూ మద్యం సేవించి ఇంట్లో భార్యతో గొడవపడుతుండేవాడు. తండ్రి తీరుపై లోవరాజు ఆగ్రహం వ్యక్తం చేసేవాడు. ఈ విషయంపై తండ్రీకొడుకులు పలుమార్లు గొడవపడ్డారు. ఈ క్రమంలోనే మళ్లీ మద్యం సేవించి వచ్చిన బుడ్డయ్య కూర కోసం లక్ష్మమ్మతో గొడవపడ్డాడు. అక్కడే ఉన్న లోవరాజు కల్పించుకుని తండ్రిని అడ్డుకున్నాడు.
తల్లిని వేధిస్తే ఊరుకోనని హెచ్చరించాడు. వద్దని వారిస్తున్నా తండ్రి వినకపోవడంతో లోవరాజు విచక్షణ కోల్పోయాడు. పక్కనే ఉన్న చెక్క పీటతో తండ్రి తలపై మోదాడు. దీంతో తీవ్ర రక్తస్రావంతో తండ్రి బుడ్డయ్య అక్కడికక్కడే చనిపోయాడు. తండ్రి కుప్పకూలడం చూసి లోవరాజు భయంతో అక్కడి నుంచి పారిపోయాడు. కాగా, బుడ్డయ్య మృతిపై హత్య కేసు నమోదు చేసిన పోలీసులు.. లోవరాజు కోసం గాలింపు చర్యలు చేపట్టారు.