Nandamuri Harikrishna: నంద‌మూరి హ‌రికృష్ణ వ‌ర్ధంతి.. సీఎం చంద్ర‌బాబు, మంత్రి లోకేశ్ నివాళులు

Nandamuri Harikrishna Death Anniversary Chandrababu Naidu Lokesh Pay Tribute
  • నేడు నంద‌మూరి హ‌రికృష్ణ వ‌ర్ధంతి
  • ఎక్స్ వేదిక‌గా నివాళుల‌ర్పించిన చంద్ర‌బాబు, లోకేశ్ 
  • త‌మ మ‌ధ్య బంధుత్వ‌మే కాకుండా ఆత్మీయ‌త‌, స్నేహం ఉండేవ‌న్న‌ చంద్ర‌బాబు 
  • హరి మామయ్య లేనిలోటు తీర్చలేనిదన్న లోకేశ్‌
నేడు నంద‌మూరి హ‌రికృష్ణ వ‌ర్ధంతి. ఈ సంద‌ర్భంగా సీఎం చంద్ర‌బాబు, మంత్రి నారా లోకేశ్ ఆయ‌న‌కు ఎక్స్ (ట్విట్ట‌ర్‌) వేదిక‌గా నివాళుల‌ర్పించారు. త‌మ మ‌ధ్య బంధుత్వం మాత్ర‌మే కాకుండా అంత‌కుమించిన ఆత్మీయ‌త‌, స్నేహం ఉండేవ‌ని చంద్ర‌బాబు తెలిపారు. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులుగా, మంత్రిగా, ఎమ్మెల్యేగా, రాజ్యసభ సభ్యులుగా ప్రజలకు విశేష సేవలందించారని లోకేశ్ గుర్తు చేశారు. 

"నంద‌మూరి హ‌రికృష్ణ వ‌ర్ధంతి సంద‌ర్భంగా ఘ‌న నివాళులు అర్పిస్తున్నాను. మా మ‌ధ్య కేవ‌లం బంధుత్వం మాత్ర‌మే కాదు... అంత‌కంటే ఎక్కువ ఆత్మీయ‌త‌, స్నేహాన్ని మేమిద్ద‌రం పంచుకున్నాం. కుటుంబ స‌భ్యుల‌కే కాదు, పార్టీ కార్య‌క‌ర్త‌ల‌కు, ప్ర‌జ‌ల‌కు, నంద‌మూరి అభిమానుల‌కు కూడా ఆత్మీయ‌త‌ను పంచిన మంచి మ‌నిషి హ‌రికృష్ణ" అని చంద్ర‌బాబు ట్వీట్ చేశారు. 

"హరి మామయ్య వర్థంతి సందర్భంగా ఆయన స్మృతికి ఘననివాళులు అర్పిస్తున్నాను. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులుగా, మంత్రిగా, ఎమ్మెల్యేగా, రాజ్యసభ సభ్యులుగా ప్రజలకు విశేష సేవలందించారు. సినీ రంగంలోనూ తనదైన నటనతో తెలుగువారిని అలరించారు. హరి మామయ్య లేనిలోటు తీర్చలేనిది. సినీ, రాజకీయ రంగానికి వారు చేసిన సేవలను ఈ సందర్భంగా స్మరించుకుందాం" అని నారా లోకేశ్ ట్వీట్ చేశారు.   
Nandamuri Harikrishna
Chandrababu Naidu
Nara Lokesh
TDP
Telugu Desam Party
Andhra Pradesh Politics
Harikrishna Death Anniversary
Political News
Tollywood
Rajya Sabha

More Telugu News