ISIS Vizianagaram case: విజయనగరం ఐసిస్ ఉగ్ర కుట్ర కేసు: మరో కీలక నిందితుడి అరెస్టు

ISIS Vizianagaram Case Another Key Accused Arrested
  • బీహార్‌కు చెందిన అరిఫ్ హుస్సేన్ అలియాస్ అబూ తలిబ్ ను ఢిల్లీ విమానాశ్రయంలో అరెస్టు చేశామన్న ఎన్ఐఏ 
  • ఉగ్ర కుట్ర కేసులో అరెస్టయిన సిరాజ్ ఉర్ రెహ్మాన్, సయ్యద్ సమీర్లతో అరిఫ్‌కు సంబంధాలు ఉన్నట్లు గుర్తించిన ఎన్ఐఏ
  • దేశం వ్యాప్తంగా జిహాది కార్యక్రమాల కోసం అరిఫ్ అక్రమ ఆయుధాలను సరఫరా చేసినట్లుగా గుర్తించిన ఎన్ఐఏ
విజయనగరం ఐసిస్ ఉగ్రవాద కుట్ర కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) మరో ప్రధాన నిందితుడిని అరెస్టు చేసింది. అరెస్టయిన నిందితుడు బీహార్‌కు చెందిన ఆరిఫ్ హుస్సేన్ అలియాస్ అబూ తాలిబ్ అని ఎన్ఐఏ పేర్కొంది. దేశం విడిచి వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎన్ఐఏ బృందం అతడిని అదుపులోకి తీసుకుంది. నిందితుడిని విశాఖపట్నంలోని ఎన్ఐఏ ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరచనున్నారు.

విజయనగరం ఐసిస్ ఉగ్ర కేసులో ఇదివరకే అరెస్టయిన సిరాజ్ ఉర్ రెహ్మాన్, సయ్యద్ సమీర్‌లతో ఆరిఫ్‌కు సంబంధాలు ఉన్నట్లు ఎన్ఐఏ దర్యాప్తులో తేలింది. సిరాజ్, సమీర్‌ల వద్ద ఐఈడీఎస్ (విస్ఫోటక పరికరాలు) తయారీకి అవసరమైన రసాయనాలు ఉన్నట్లు ఎన్ఐఏ గుర్తించింది. వీరు ఉగ్రదాడులకు వ్యూహం పన్నినట్లు ఎన్ఐఏకి ఆధారాలు లభించాయి.

దేశవ్యాప్తంగా జిహాదీ కార్యకలాపాల కోసం ఆరిఫ్ అక్రమ ఆయుధాలను సరఫరా చేసినట్లు ఎన్ఐఏ అధికారులు గుర్తించారు. 
ISIS Vizianagaram case
Vizianagaram ISIS case
NIA
Arif Hussain
Siraj Ur Rehman
Syed Sameer
IEDs
terror plot
Delhi Airport arrest
Bihar terror suspect

More Telugu News