Bandi Sanjay: ఆప్యాయంగా పలకరించుకున్న బండి సంజయ్, కేటీఆర్... వీడియో వైరల్

Bandi Sanjay KTR Meet in Flood Affected Sircilla
  • వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన బండి సంజయ్, కేటీఆర్
  • గంభీరావుపేట మండలంలో ఎదురుపడ్డ ఇరువురు నేతలు
  • పరద పరిస్థితిని కేంద్ర మంత్రికి వివరించిన కేటీఆర్
తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు జిల్లాల్లో వరద ముంచెత్తుతోంది. వందలాది గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. పెద్ద సంఖ్యలో ప్రజలు తమ నివాసాలను వదిలేసి సురక్షిత ప్రాంతాలకు వెళుతున్నారు. ఈ నేపథ్యంలో సిరిసిల్ల జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర మంత్రి బండి సంజయ్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటించారు. 

ఈ క్రమంలో, గంభీరావుపేట మండలంలో ఇద్దరు నేతలు ఒకరికొకరు ఎదురుపడ్డారు. ఈ సందర్భంగా ఇరువురు ఆప్యాయంగా పలకరించుకున్నారు. వరద పరిస్థితి గురించి బండి సంజయ్ కు కేటీఆర్ వివరించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.  
Bandi Sanjay
KTR
Telangana Floods
Sircilla
Gambhiraopeta
Telangana Rains
BRS
Flood Relief
Telangana Politics

More Telugu News