Robin Westman: బాధితుల కోసం ప్రార్థించాలని లేఖలో కోరిన మినియాపొలిస్ హంతకుడు!

Robin Westman Minneapolis Shooter Letter Revealed
  • మీ జీవితాలను తలకిందులు చేయబోతున్నా.. కుటుంబ సభ్యులు, స్నేహితులకు క్షమాపణ
  • అవసరమైతే పేర్లు మార్చుకొని జీవించాలని సూచన
  • తల్లిదండ్రులుగా మీ పెంపకంపై అనుమానాలు వద్దన్న హంతకుడు
అమెరికాలోని మినియాపొలిస్ లో కాల్పులు జరిపిన రాబిన్ వెస్ట్ మన్ ఆ తర్వాత తాను కూడా కాల్చుకుని మరణించాడు. ఈ దారుణానికి పాల్పడే ముందు తన కుటుంబ సభ్యులు, స్నేహితులను ఉద్దేశించి రాసిన ఓ లేఖలో వెల్లడించిన వివరాలు ప్రస్తుతం సంచలనంగా మారాయి. తనను క్షమించాలంటూ వెస్ట్ మన్ తన కుటుంబం, స్నేహితులను ఉద్దేశించి లేఖలో రాశాడు. అయితే, ఈ దారుణానికి పాల్పడినందుకు కాదు, దానివల్ల వారి జీవితాల్లో కలిగే విపరీతమైన మార్పులకు మాత్రమే తనను క్షమించాలని కోరాడు. తాను ఎవరి నుంచీ మన్నింపు ఆశించడంలేదని, చేసిన పనికి ఎవరికీ క్షమాపణ చెప్పాలని అనుకోవడంలేదని స్పష్టం చేశాడు.

వెస్ట్ మన్ లేఖలో ఏముందంటే..
‘‘బాధితుల గురించి, బాధితుల కుటుంబాల గురించి ప్రార్థించండి. నేను చేయబోయే పని మీ (కుటుంబ సభ్యులు) జీవితాలను తలకిందులు చేస్తుందని తెలుసు. అందుకు నన్ను క్షమించండి. మీ పెంపకంపై ఎలాంటి సందేహం అక్కర్లేదు. తల్లిదండ్రులుగా మీరు నన్ను చాలా బాగా పెంచారు. కానీ ఈ ప్రపంచంలోని ద్వేషం నన్ను ఈ పనికి ఉసిగొల్పింది. నా వల్ల మీ జీవితాలపై మరక పడుతుంది. అవసరమైతే మీరు పేర్లు మార్చుకుని వేరే చోటికి వెళ్లి జీవించండి. నన్ను, నా చర్యలను మర్చిపోయి జీవితంలో ముందుకు సాగండి. 

నేను చేయబోయే పనికి ఎలాంటి మన్నింపు ఆశించడంలేదు. ఎవరికీ క్షమాపణ చెప్పాలని కూడా అనుకోవడంలేదు. కానీ, దానివల్ల నా కుటుంబం, నాకు సన్నిహితంగా ఉన్న వారి జీవితాలు తలకిందులవుతాయి. అందుకు నేను కూడా బాధపడుతున్నా. మీకు ఇలాంటి కష్టాన్ని తీసుకువచ్చినందుకు దయచేసి నన్ను క్షమించండి. ఈ ప్రపంచం నాకు తీరని వేదనను మిగిల్చింది. కొన్నేళ్లుగా ఆత్మహత్య ఆలోచనలతో సతమతమవుతున్నాను. 

ఇటీవల నా జీవితంలో జరిగిన సంఘటనలతో చివరి ఆశను కూడా కోల్పోయి ఈ పనికి పాల్పడుతున్నాను. ఈ ప్రపంచం చేసిన అన్యాయానికి తలొగ్గి బతకడం నాకిష్టం లేదు. నేను క్యాన్సర్ తో బాధపడుతున్నాను. లంగ్ క్యాన్సర్ నా శరీరాన్ని నశింపజేస్తోంది. ఈ వ్యాధితో ఆసుపత్రుల చుట్టూ తిరుగుతూ, బెడ్ పై జీవచ్ఛవంలా బతకాలని అనుకోవట్లేదు. అందుకే ఈ ప్రపంచం నుంచి వెళ్లిపోతున్నాను. వెళుతూ వెళుతూ కొన్నేళ్లుగా నా మదిని తొలిచివేస్తున్న ‘చివరి పని’ ని పూర్తి చేస్తున్నాను” అంటూ రాబిన్ వెస్ట్ మన్ తన లేఖలో పేర్కొన్నాడు.
Robin Westman
Minneapolis shooting
Minnesota shooting
Mass shooting
Letter
Suicide
Lung cancer
Gun violence
America

More Telugu News