అమీర్‌పేటలో భారీ అగ్నిప్రమాదం
- అమీర్ పేటలోని బాలాజీ నెయ్యి దుకాణం నుంచి ఎగసిపడిన మంటలు
- మూడు ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేసిన అగ్నిమాపక సిబ్బంది
- పక్కనే ఉన్న ఎంబ్రాయిడరీ షాపులోకి మంటల వ్యాప్తి
ప్రమాదం జరిగిన సమయంలో దుకాణంలో ఎంతమంది ఉన్నారనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది. మంటలు తీవ్రంగా ఎగసిపడటంతో పక్కనే ఉన్న ఎంబ్రాయిడరీ షాపుకు కూడా వ్యాపించాయి. ఈ ప్రమాదంలో ఆ దుకాణంలోని వస్తువులు పూర్తిగా కాలిపోయాయి. ప్రమాదానికి గల కారణాలు, నష్టం ఎంత వాటిల్లిందనే వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది.