Maoists: మహారాష్ట్రలో భారీ ఎన్ కౌంటర్... నలుగురు మావోయిస్టుల మృతి

Maoists Killed in Major Encounter in Maharashtra
గడ్చిరోలి – నారాయణపుర్ అటవీ ప్రాంతంలో ఘటన
పక్కా సమాచారంతో కూంబింగ్ ఆపరేషన్ ప్రారంభించిన భద్రతా బలగాలు
వర్షం పడుతున్నా రెండు రోజులాగ కూంబింగ్ ఆపరేషన్ కొనసాగించిన భద్రతా దళాలు
ఘటనా స్థలంలో నాలుగు తుపాకులు స్వాధీనం చేసుకున్న భద్రతా దళాలు
మహారాష్ట్ర-ఛత్తీస్‌గఢ్ సరిహద్దులో మావోయిస్టులకు, భద్రతా దళాలకు మధ్య జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో నలుగురు మావోయిస్టులు మృతిచెందారు. వీరిలో ముగ్గురు మహిళలు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘర్షణ గడ్చిరోలి-నారాయణపుర్ అటవీ ప్రాంతంలో జరిగింది.

పక్కా సమాచారంతో 

గడ్చిరోలి డివిజన్‌కి చెందిన గట్టా దళాల్, కంపెనీ నెం.10 మావోయిస్టులు ఆ ప్రాంతంలో గుట్టుచప్పుడు కాకుండా సంచరిస్తున్నారని పోలీసులకు పక్కా సమాచారం అందింది. దీంతో రెండు రోజుల క్రితం 19సీ-60 కమాండో యూనిట్లు, క్విక్ యాక్షన్ టీమ్స్, సీఆర్పీఎఫ్ బలగాలు రంగంలోకి దిగాయి. అక్కడే క్యాంపులు వేసి కూంబింగ్ మొదలు పెట్టాయి. 
 
వర్షం పడుతున్నా కొనసాగిన కూంబింగ్

గత రెండు రోజులుగా వర్షం పడుతున్నా భద్రతా దళాలు తమ కూంబింగ్ ఆపరేషన్‌ను కొనసాగించారు. నిన్న ఉదయం మావోయిస్టులు భద్రతా దళాలపై ఆకస్మికంగా కాల్పులు ప్రారంభించడంతో దళాలు స్పందించాయి. రెండు వర్గాల మధ్య సుమారు 8 గంటల పాటు కాల్పులు చోటుచేసుకున్నాయి.
 
చనిపోయిన నలుగురు మావోయిస్టులో ముగ్గురు మహిళలు

ఈ కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు హతమయ్యారు. భద్రతా దళాలు సంఘటనా ప్రదేశం నుంచి నాలుగు తుపాకులను స్వాధీనం చేసుకున్నారు. మృతుల్లో ముగ్గురు మహిళలు ఉన్నారు.
 
ఇతర మావోయిస్టుల కోసం గాలింపు

పరిసర ప్రాంతాల్లో ఇంకా మావోయిస్టులు ఉండే అవకాశం ఉందని భావిస్తూ భద్రతా బలగాలు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి. ఎన్‌కౌంటర్‌కు సంబంధించి మరిన్ని వివరాలను త్వరలో మీడియాతో పంచుకుంటామని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.
Maoists
Maharashtra
Chhattisgarh
Gadchiroli
Naxalites
encounter
security forces
CRPF
anti naxal operations
Naraynpur

More Telugu News