Nalgonda Police: కార్లలో వచ్చి గొర్రెల చోరీ.. పక్కా ప్లాన్‌తో లూటీ చేస్తున్న నాలుగు ముఠాల ఆటకట్టు

Sheep theft gang busted by Nalgonda Police 16 arrested
  • పగలు కార్లలో రెక్కీ.. రాత్రి అవే కార్లలో వచ్చి చోరీలు
  • ముఠాలో ఇద్దరు మహిళల సహా 18 మంది సభ్యులు
  • 16 మందిని అరెస్ట్ చేసిన నల్గొండ పోలీసులు, ఇద్దరు పరారీ
  • వివిధ జిల్లాల్లో 26 ఘటనల్లో 200 పైగా జీవాల అపహరణ
  • రూ.17 లక్షల విలువైన 8 కార్లు, నగదు స్వాధీనం
పగటిపూట కార్లలో దర్జాగా తిరుగుతూ రెక్కీ నిర్వహించడం, రాత్రివేళల్లో అవే కార్లలో వచ్చి గొర్రెలు, మేకలను అపహరించుకుపోవడం.. కొంతకాలంగా పలు జిల్లాల్లో రైతులను కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న నాలుగు దొంగల ముఠాలను నల్గొండ జిల్లా పోలీసులు పకడ్బందీగా పట్టుకున్నారు. ఈ ముఠాలకు చెందిన 16 మందిని అరెస్ట్ చేశారు.

సోమవారం శాలిగౌరారం మండలం బైరవబండ క్రాస్‌రోడ్డు వద్ద పోలీసులు వాహన తనిఖీలు చేస్తుండగా ఓ కారులో ఉన్న ముగ్గురు పురుషులు, ఒక మహిళ కారు దిగి పారిపోయేందుకు ప్రయత్నించారు. వారిని అదుపులోకి తీసుకుని వేలిముద్రలను స్కాన్ చేయగా, పాత నేరస్థులైన సంపంగి వెంకటేశ్‌, వేంరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, సంపంగి శారద, దాసర్ల వినోద్‌కుమార్‌గా తేలింది. వీరిపై గతంలోనే జిల్లాలోని 12 పోలీస్ స్టేషన్లలో మేకల దొంగతనం కేసులు నమోదై ఉన్నట్లు గుర్తించారు.

లోతుగా విచారించగా విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. ఈ నలుగురు తమకు పరిచయమున్న మరో 14 మందితో కలిసి మొత్తం నాలుగు ముఠాలుగా ఏర్పడి దొంగతనాలకు పాల్పడుతున్నట్లు అంగీకరించారు. నల్గొండ జిల్లాలోని 15 ప్రాంతాలతో పాటు రాచకొండ, సైబరాబాద్‌, మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూల్‌ జిల్లాల్లోని 11 ప్రాంతాల్లో కలిపి ఇప్పటివరకు 26 ఘటనల్లో 200కు పైగా జీవాలను దొంగిలించినట్లు తేలింది.

మొత్తం 18 మంది సభ్యులున్న ఈ ముఠాల్లో 16 మందిని అరెస్ట్ చేశామని, మరో ఇద్దరు పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు. అరెస్టయిన వారిలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అమ్ములూరి విజయ్ అనే వ్యక్తి కూడా ఉన్నాడు. నిందితుల నుంచి రూ. 2.46 లక్షల నగదు, 22 గొర్రెలు, చోరీలకు ఉపయోగించిన రూ. 17 లక్షల విలువైన 8 కార్లను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన వివరించారు.
Nalgonda Police
sheep theft
goat theft
crime news
Telangana police
car theft gang
organized crime
cyberabad
mahabubnagar
nagar Kurnool

More Telugu News