అసలు రేవంత్ రెడ్డి ఎవరు?: ప్రశాంత్ కిశోర్ తీవ్ర ఆగ్రహం
- బీహార్ రాజకీయాల్లో రేవంత్ రెడ్డి జోక్యం ఏమిటన్న ప్రశాంత్ కిశోర్
- రేవంత్ రెడ్డికి బీహార్‌లో ఏం పని అని నిలదీత
- బీహార్‌ను అవమానించాడని ఆగ్రహం
బీహార్‌తో రేవంత్ రెడ్డికి ఉన్న సంబంధం ఏమిటని, ఆయన స్థాయి ఏమిటని ప్రశాంత్ కిశోర్ నిలదీశారు. ఒకవైపు బీహార్ ప్రజలను అవమానించేలా మాట్లాడి, మరోవైపు అదే బీహార్‌కు ఓట్లు అడగడానికి ఎలా వస్తారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి వైఖరిపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. బీహార్‌ను అవమానించే నాయకులను కాంగ్రెస్ కలిగి ఉందని, ఇది రాహుల్ గాంధీ మనస్తత్వాన్ని ప్రతిబింబిస్తుందని ఆయన వ్యాఖ్యానించారు.