Whip Tradition: అక్క‌డ‌ వింత ఆచారం.. తాళి కట్టగానే వరుడికి కొరడా దెబ్బలు.. ఎందుకో తెలుసా?

Groom Whipped Strange Wedding Tradition in Andhra Pradesh
  • వైఎస్సార్ కడప జిల్లాలో ఓ వింత వివాహ సంప్రదాయం
  • పెళ్లిలో వరుడికి తప్పని మూడు కొరడా దెబ్బలు
  • తాళి కట్టిన వెంటనే పెళ్లికొడుకును కొడుతున్న బంధువులు
  • శతాబ్దాలుగా 'బూచుపల్లె' వంశంలో కొనసాగుతున్న ఆచారం
  • గంగమ్మ తల్లి ఆదేశం ప్రకారమేనంటున్న స్థానికులు
  • సుమారు 1000కి పైగా కుటుంబాలు పాటిస్తున్న సంప్రదాయం
వివాహ వేడుకలో ఎన్నో సంప్రదాయాలు, సరదా కార్యక్రమాలు ఉంటాయి. కానీ, వైఎస్సార్ కడప జిల్లాలోని కొన్ని గ్రామాల్లో ఓ విచిత్రమైన ఆచారం శతాబ్దాలుగా కొనసాగుతోంది. ఇక్కడ పెళ్లి పీటలపై వధువు మెడలో వరుడు తాళి కట్టిన వెంటనే, అతడికి బంధువులు కొరడాతో మూడు దెబ్బలు కొడతారు. ఈ వింత ఆచారం 'బూచుపల్లె' వంశీయుల ఇళ్లలో జరిగే పెళ్లిళ్లలో తప్పనిసరిగా పాటిస్తారు.

ఏంటీ సంప్రదాయం.. ఎందుకీ దెబ్బలు?
'బూచుపల్లె' వంశీయులు తమ ఇళ్లలో జరిగే వివాహ వేడుకలో తాళి కట్టే కార్యక్రమం పూర్తయిన తర్వాత, వరుడిని కొరడాతో మూడు సార్లు కొడతారు. ఈ ఆచారం వెనుక ఓ ఆసక్తికరమైన కథ ప్రచారంలో ఉంది. వందల సంవత్సరాల క్రితం, వీరి పూర్వీకులు గంగమ్మ ఆలయం నుంచి పొరపాటున ఓ పెట్టెను ఇంటికి తీసుకొచ్చారట. ఆ పెట్టెను తెరిచి చూడగా అందులో ఐదు కొరడాలు కనిపించాయి. తమ తప్పు తెలుసుకున్న వారు, గంగమ్మ తల్లిని క్షమించమని వేడుకోగా, అమ్మవారు ప్రత్యక్షమైందని స్థానికులు చెబుతారు. అప్పటి నుంచి వారి వంశంలో జరిగే ప్రతి పెళ్లిలో వరుడికి మూడు కొరడా దెబ్బలు కొట్టాలని అమ్మవారే ఆదేశించినట్లు వారు నమ్ముతారు.

ఆనాటి నుంచి గంగమ్మ ఆదేశాన్ని పాటిస్తూ, తరతరాలుగా ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. ఈ ఆచారం తమ వంశానికి ఎంతో ముఖ్యమని బూచుపల్లె వంశీయులు తెలిపారు.

వైఎస్సార్ కడప జిల్లాలోని భద్రంపల్లె, లోమడ, బూచుపల్లె, బోడివారిపల్లె, మల్లేల, తొండూరు, ఇనగలూరు, సంతకొవ్వూరు, అగడూరు వంటి గ్రామాల్లో ఈ వంశానికి చెందిన సుమారు 1000కి పైగా కుటుంబాలు నివసిస్తున్నాయి. వీరందరూ నేటికీ తమ పెళ్లిళ్లలో ఈ కొరడా దెబ్బల సంప్రదాయాన్ని పాటిస్తూ, తమ పూర్వీకుల మాటను గౌరవిస్తున్నారు.
Whip Tradition
Buchupalle
Kadapa district
Andhra Pradesh
marriage tradition
unique wedding ritual
Gangamma temple
wedding customs
YSR Kadapa
Telugu traditions

More Telugu News