Donald Trump: అమెరికాలో భారతీయ ట్రక్కు డ్రైవర్లకు వీసా కష్టాలు

Donald Trump Visa Issues for Indian Truck Drivers in US
  • ఫ్లోరిడాలో రాంగ్ యూటర్న్ తీసుకుంటూ ప్రమాదానికి కారణమైన భారతీయ ట్రక్కు డ్రైవర్
  • ముగ్గురు అమెరికన్ల దుర్మరణం నేపథ్యంలో ట్రక్కు డ్రైవర్లకు వీసాలపై ట్రంప్ ఆంక్షలు
  • కమర్షియల్ డ్రైవింగ్ లైసెన్స్ ల జారీని నిలిపివేసిన అమెరికా ప్రభుత్వం
అమెరికాలో ట్రక్కు డ్రైవర్లుగా ఉపాధి పొందుతున్న భారతీయ డ్రైవర్లకు వీసా కష్టాలు ఎదురవుతున్నాయి. కొత్త వీసాల జారీ నిలిచిపోవడంతో పాటు కమర్షియల్ డ్రైవింగ్ లైసెన్స్ ల జారీ కూడా అక్కడి ప్రభుత్వం ఆపేసింది. ఇందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జారీ చేసిన ఆదేశాలే కారణమని ట్రక్కు డ్రైవర్లు వాపోతున్నారు. ఫ్లోరిడాలో ఇటీవల ఓ భారతీయ ట్రక్కు డ్రైవర్ రాంగ్ యూటర్న్ తీసుకుంటూ ప్రమాదానికి కారణమయ్యాడు.

సిగ్నల్ లేకున్నా యూటర్న్ తీసుకోవడంతో వెనకే వేగంగా వచ్చిన కారు సదరు ట్రక్కును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారులోని ముగ్గురు అమెరికన్లు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. దీంతో అమెరికా వ్యాప్తంగా తీవ్ర ఆందోళన వ్యక్తమైంది. ఈ ప్రమాదంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సీరియస్ గా స్పందించారు. డ్రైవర్లకు వర్క్ వీసాలతో పాటు కమర్షియల్ డ్రైవింగ్ లైసెన్స్ ల జారీని నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నిర్ణయం అమెరికాలో మోటార్‌ వాహన రంగంలో స్థిరపడాలని కలలు కన్న వేలాది మంది భారతీయులకు శాపంగా మారింది.
 
అమెరికాలో హెవీ ట్రక్కు డ్రైవర్లకు పెద్ద మొత్తంలో వేతనాలు చెల్లిస్తారు. దీంతో భారత్‌లోని పంజాబ్‌ నుంచి యువత ఎక్కువగా అక్కడికి వెళ్లి డ్రైవర్లుగా స్థిరపడుతున్నారు. అక్కడి విదేశీ ట్రక్కు డ్రైవర్లలో భారతీయ సిక్కుల సంఖ్యే ఎక్కువ. పంజాబ్‌ తో పాటు హర్యానా నుంచి పెద్ద సంఖ్యలో వెళుతుంటారు. ఈ క్రమంలోనే ట్రంప్ ఆంక్షలు అక్కడి ట్రక్కు డ్రైవర్లతో పాటు అమెరికా వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న భారతీయ డ్రైవర్లకు ఇబ్బందులు తెచ్చిపెట్టింది. అయితే, అమెరికాలో ట్రక్కు డ్రైవర్ల కొరత తీవ్రంగా ఉండడంతో ట్రంప్ ఆంక్షలు ఎక్కువ కాలం ఉండవని అమెరికా ట్రాన్స్‌పోర్ట్ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Donald Trump
Indian truck drivers
US visa
trucking industry
commercial driving license
US transport
Florida accident
H1B visa
Punjab drivers
Haryana drivers

More Telugu News