Chandrababu Naidu: చంద్రబాబులో భయం కొట్టొచ్చినట్టు కనిపించింది.. ధైర్యం రావాలంటే ఇది చేయాలి: అంబటి రాంబాబు

Ambati Rambabu Criticizes Chandrababu Naidus Fearful Appearance
  • పెద్దాపురం ప్రసంగంలో చంద్రబాబులో భయం కనిపించిందన్న అంబటి
  •  ధైర్యం కోసం భూతవైద్యుడిని సంప్రదించాలని వ్యంగ్యం
  • ఇప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే కూటమి ఓడిపోతుందని వ్యాఖ్య
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. చంద్రబాబులో భయం మొదలైందని, ధైర్యం కోసం ఆయన ఓ భూతవైద్యుడిని సంప్రదిస్తే మంచిదని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. రాజమండ్రిలో మీడియాతో మాట్లాడిన అంబటి, ఇటీవ‌ల తూర్పుగోదావ‌రి జిల్లా పెద్దాపురంలో సీఎం చేసిన ప్రసంగంపై స్పందించారు.

పెద్దాపురంలో చంద్రబాబు చేసిన ప్రసంగంలో ఆయన భయం కొట్టొచ్చినట్టు కనిపించిందని అంబటి వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలమైందని ఆయన ఆరోపించారు. ఇప్పటివరకు ఎన్ని హామీలను నెరవేర్చారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహిస్తే అధికార కూటమి ఓటమి పాలుకావడం ఖాయమని అంబటి రాంబాబు జోస్యం చెప్పారు. ప్రజల మద్దతుతో వైసీపీ అధినేత జగన్ తిరిగి అధికారంలోకి రావడం తథ్యమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
Chandrababu Naidu
Ambati Rambabu
YSRCP
Andhra Pradesh Politics
AP Elections 2024
Peddapuram
Jagan Mohan Reddy
Telugu News
Political Criticism
Election Promises

More Telugu News