Kishan Reddy: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
- కుటుంబ సమేతంగా బ్రేక్ దర్శనంలో స్వామివారి దర్శనం చేసుకున్న కిషన్ రెడ్డి
- ఆహ్వానం పలికిన టీటీడీ అధికారులు
- సైనిక శక్తి, దేశ భద్రత మరింత శక్తిమంతంగా ఉండాలని భగవంతుడిని ప్రార్ధించానన్న కిషన్ రెడ్డి
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ ఉదయం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. తన కుటుంబ సభ్యులతో కలిసి వేకువజామున శ్రీవారి సుప్రభాత సేవలో ఆయన పాల్గొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.
దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆయనకు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం కిషన్ రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ దేశమంతటా మంచి వర్షాలు కురిసి రైతులు, ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని శ్రీవారిని ప్రార్థించినట్లు తెలిపారు. సైనికులు పట్టుదలతో, అంకితభావంతో పనిచేస్తున్నారని కొనియాడారు. దేశ సైనిక శక్తి, దేశ భద్రత మరింత శక్తిమంతంగా ఉండాలని భగవంతుడిని ప్రార్థించినట్లు ఆయన పేర్కొన్నారు.