Chandrababu Naidu: ఆనంద్ మహీంద్రా పోస్టుపై స్పందించిన సీఎం చంద్రబాబు .. అతిథ్య రంగంలో పెట్టుబడులు పెట్టాలంటూ ఆహ్వానం

Chandrababu Invites Anand Mahindra to Invest in AP Hospitality
  • ఏపీలో బీచ్‌లపై ప్రముఖ ఆంగ్లపత్రికలో కథనం
  • ఆ కథనాన్ని ఎక్స్ లో పోస్టు చేసిన ఆనంద్ మహీంద్రా
  • దిండి లాంటి ఎన్నో అందమైన ప్రదేశాలు రాష్ట్రంలో ఉన్నాయన్న సీఎం చంద్రబాబు
రాష్ట్రంలో ఆతిథ్య రంగంలో పెట్టుబడులు పెట్టాలని మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రాను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆహ్వానించారు. ఏపీలోని బీచ్‌ల గురించి ఓ ప్రముఖ ఆంగ్లపత్రికలో వచ్చిన కథనాన్ని ప్రస్తావిస్తూ ఆనంద్ మహీంద్రా చేసిన సోషల్ మీడియా పోస్టుకు స్పందనగా సీఎం చంద్రబాబు ‘ఎక్స్’ (పూర్వపు ట్విట్టర్) వేదికగా ఈ వ్యాఖ్యలు చేశారు.

‘‘దిండి లాంటి ఎన్నో అందమైన ప్రదేశాలు మా రాష్ట్రంలో ఉన్నాయి. పర్యాటకం సంస్కృతుల్ని అనుసంధానిస్తుంది, ఉపాధిని సృష్టిస్తుంది, అభివృద్ధికి బాటలు వేస్తుంది’’ అని చంద్రబాబు పేర్కొన్నారు.

రాష్ట్రంలో ఉన్న ఆధ్యాత్మిక వారసత్వ ప్రదేశాలు, ప్రకృతి సౌందర్యం, సముద్రతీర ప్రాంతాలను అభివృద్ధి చేసి, ప్రపంచ స్థాయి పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆతిథ్య రంగ ప్రముఖులను కూడా రాష్ట్రంలో పెట్టుబడులకు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు.

సాంకేతికత, పర్యాటకం, ఆతిథ్య రంగాల్లో ప్రైవేట్ భాగస్వామ్యాలను ఆకర్షించాలన్న దిశగా ఏపీ ప్రభుత్వం వేగంగా ముందుకెళ్తోంది. 
Chandrababu Naidu
Anand Mahindra
Andhra Pradesh Tourism
AP Tourism
Hospitality Sector Investment
Dindi Andhra Pradesh
Beach Tourism India
AP Beaches
Tourism Development AP
Private Investment AP

More Telugu News