Bandla Ganesh: బండ్ల గణేశ్‌ ఇంట్లో గెట్ టూ గెదర్.. టాలీవుడ్‌కు చెందిన పలువురు ప్రముఖులు హాజరై సంద‌డి

Bandla Ganesh Hosts Tollywood Get Together Party
  • పార్టీకి హాజ‌రైన‌ శ్రీకాంత్, బ్రహ్మాజీ, ఆలీ, కె. రాఘవేంద్రరావు, కృష్ణవంశీ
  • ఫొటోలను తన ఎక్స్ ఖాతాలో షేర్ చేసిన నటుడు బ్రహ్మాజీ 
  • '30 ఇయర్స్ ఇండస్ట్రీ.. పార్టీకి థాంక్యూ బండ్ల గణేశ్‌ బ్రో' అంటూ క్యాప్ష‌న్‌
  • సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారిన ఫొటోలు
నటుడు, నిర్మాత బండ్ల గణేశ్ ఇంట్లో తాజాగా జ‌రిగిన గెట్ టూ గెదర్ ప్రత్యేక పార్టీలో టాలీవుడ్‌కు చెందిన పలువురు ప్రముఖులు హాజరై సంద‌డి చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను నటుడు బ్రహ్మాజీ తన ఎక్స్ (ట్విట్ట‌ర్‌) ఖాతాలో షేర్ చేశారు. “30 ఇయర్స్ ఇండస్ట్రీ. పార్టీకి థాంక్యూ బండ్ల గణేశ్‌ బ్రో. యంగ్ అండ్ డైనమిక్ డైరెక్టర్స్‌తో… సీనియర్ సిటిజన్స్… కాదు కాదు, సీనియర్ యాక్టర్స్” అని క్యాప్షన్ ఇచ్చారు. ఈ పార్టీకి శ్రీకాంత్, బ్రహ్మాజీ, ఆలీ, శివాజీ రాజా, కృష్ణవంశీ, రాజా రవీంద్ర, శివాజీ, కె. రాఘవేంద్రరావు, బీవీఎస్ రవి త‌దిత‌రులు హాజరయ్యారు. 

ఇప్పుడు ఈ ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌ అవుతున్నాయి. కాగా, ఇటీవల కాలంలో పాత తరం హీరోలు, దర్శకులు తరచూ రీ యూనియన్ పేరుతో కలుస్తూ అభిమానుల‌ను అల‌రిస్తున్న విష‌యం తెలిసిందే. ఇదే కోవ‌లో తాజాగా బండ్ల గణేష్ ఇంట్లో జరిగిన ఈ గెట్ టుగెదర్ కూడా అలాంటి వాతావరణాన్నే తలపించింది. 

ఇక‌, ఇదే తరహాలో ఇటీవల గోవాలో గ్లామరస్ రీ యూనియన్ పేరిట ఓ పార్టీ జరిగింది. ఈ పార్టీలో సీనియ‌ర్ హీరోయిన్లు సంగీత, సిమ్రన్, మహేశ్వరి, సంఘవి, కావ్య రమేశ్‌, ఊహ, శివ రంజనిల‌తో పాటు ద‌ర్శ‌కులు శంకర్, కేఎస్ రవికుమార్, లింగుసామి, మోహన్ రాజా, హీరోలు శ్రీకాంత్, జగపతి బాబు, ప్రభుదేవా తదితరులు పాల్గొన్నారు. అందుకు సంబంధించిన ఫొటోలు కూడా సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అయ్యాయి. 
Bandla Ganesh
Tollywood
Brahmaji
Srikanth
Ali
Krishna Vamsi
K Raghavendra Rao
Telugu cinema
get together
party

More Telugu News