Gadwal Vijayalakshmi: పర్యావరణహితంగా వినాయక చవితి పండుగ చేసుకోవాలి: జీహెచ్ఎంసీ మేయర్

Gadwal Vijayalakshmi calls for eco friendly Vinayaka Chavithi celebrations
  • గణేశ్ ఉత్సవాల కోసం జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేసినట్లు వెల్లడి
  • జీహెచ్ఎంసీ పరిధిలో 2 లక్షల మట్టి విగ్రహాలను పంపిణీకి సిద్ధం ఉంచినట్లు వెల్లడి
  • 25 వేల మంది కార్మికులు మూడు షిఫ్టుల్లో పని చేస్తున్నారన్న విజయలక్ష్మి
పర్యావరణహితంగా వినాయక చవితి పండుగను జరుపుకోవాలని ప్రజలకు జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి విజ్ఞప్తి చేశారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో గణేశ్ చవితి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఆమె తెలిపారు.

జీహెచ్ఎంసీ తరఫున 2 లక్షల మట్టి గణపతి విగ్రహాలను పంపిణీకి సిద్ధం చేశామని ఆమె వెల్లడించారు. గణేశ్ పండుగ కోసం 25 వేల మంది కార్మికులు మూడు షిఫ్టుల్లో విధుల్లో ఉంటారని ఆమె పేర్కొన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పారిశుద్ధ్యం, వీధిలైట్లు, చెట్ల తొలగింపు, రోడ్ల మరమ్మతులు, నిమజ్జనం ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆమె తెలియజేశారు.
Gadwal Vijayalakshmi
GHMC
Vinayaka Chavithi
Ganesh Chaturthi
Hyderabad
Eco friendly Ganesha

More Telugu News