Suravaram Sudhakar Reddy: అధికారిక లాంఛనాలతో సురవరం అంతిమయాత్ర... రేవంత్ రెడ్డి ఆదేశం

Suravaram Sudhakar Reddy Funeral with State Honors Ordered by Revanth Reddy
  • ప్రస్తుతం కేర్ ఆసుపత్రి మార్చురీలో ఉన్న సురవరం భౌతికకాయం
  • రేపు ఉదయం మఖ్దూం భవన్ కు తరలింపు
  • అనంతరం గాంధీ మెడికల్ కాలేజీకి అంతిమయాత్ర
సీపీఐ సీనియర్ నేత, ఆ పార్టీ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి అంతిమయాత్రను అధికార లాంఛనాలతో నిర్వహించాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఈ మేరకు తక్షణమే ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆయన ఆదేశించారు. వృద్ధాప్యం, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న సురవరం నిన్న రాత్రి గచ్చిబౌలిలోని కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే.

రేపు ఉదయం 9 గంటలకు గచ్చిబౌలి కేర్ ఆసుపత్రి నుంచి సురవరం భౌతికకాయాన్ని పార్టీ రాష్ట్ర కార్యాలయమైన మఖ్దూం భవన్‌కు తరలిస్తారు. అక్కడ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజల సందర్శనార్థం ఉంచుతారు.

మధ్యాహ్నం 3 గంటలకు మఖ్దూం భవన్ నుంచి గాంధీ మెడికల్ కాలేజీ వరకు అంతిమయాత్ర కొనసాగుతుంది. ఊరేగింపు ప్రారంభానికి ముందు ప్రభుత్వ లాంఛనాలతో పోలీసులు ఆయన పార్థివ దేహానికి గౌరవ వందనం సమర్పిస్తారు. సాయంత్రం 5 గంటలకు వైద్య విద్యార్థుల పరిశోధనల కోసం సురవరం పార్థివ దేహాన్ని గాంధీ మెడికల్ కాలేజీకి అప్పగిస్తారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో పాటు పలు పార్టీల నాయకులు హాజరయ్యే అవకాశం ఉంది.
Suravaram Sudhakar Reddy
Suravaram Sudhakar Reddy funeral
Telangana CM Revanth Reddy
CPI leader
Makdoom Bhavan
Gandhi Medical College
State funeral
Telangana news

More Telugu News