Anagani Satya Prasad: ఏపీలో రైతులకు సరికొత్త పట్టాదార్ పాస్ పుస్తకాలు

Anagani Satya Prasad Announces New Pattadar Pass Books for AP Farmers
  • కొత్తగా 21 లక్షల పట్టాదారు పాసు పుస్తకాలు జారీ చేస్తున్నామన్న మంత్రి అనగాని
  • వైసీపీ ప్రభుత్వం చేసిన పాపాలను ఇప్పటికీ సరి చేస్తున్నామని వ్యాఖ్య 
  • రైతుల అర్జీలు వంద శాతం పరిష్కరించామన్న మంత్రి
రాష్ట్రంలోని రైతులకు ఎలాంటి పొరపాట్లు లేకుండా సరికొత్తగా 21 లక్షల పట్టాదారు పాస్ పుస్తకాలను జారీ చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రకటించారు. పాస్ పుస్తకాల పంపిణీకి ముందు మరోసారి క్షుణ్ణంగా పరిశీలన చేస్తామని ఆయన స్పష్టం చేశారు.

గత వైసీపీ ప్రభుత్వం చేసిన తప్పులను ఇప్పటికీ సరిదిద్దుతున్నామని ఆయన అన్నారు. రీ-సర్వే పూర్తయిన గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు, అవగాహన సభల ద్వారా రైతుల నుంచి వచ్చిన దరఖాస్తులను వంద శాతం పరిష్కరించినట్లు ఆయన వెల్లడించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, "రైతులకు తప్పులు లేని పాస్ పుస్తకాలను అందించడం ప్రభుత్వ బాధ్యత. పాస్ పుస్తకాలతో రుణాలకు సంబంధం లేదని స్పష్టంగా తెలియజేస్తున్నాం" అని అన్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న ఈ చర్యలు భూ పరిపాలన వ్యవస్థలో పారదర్శకతను తీసుకురావడానికి ఎంతగానో ఉపయోగపడతాయని అధికారులు భావిస్తున్నారు. 
Anagani Satya Prasad
AP Revenue Department
Pattadar Pass Books
Andhra Pradesh Farmers
Land Records
AP Land Survey
YCP Government
Agricultural Loans
Revenue Minister
Farmer Welfare

More Telugu News