KTR: మూసీ నది అభివృద్ధికి కేసీఆర్ ప్రభుత్వం ప్లాన్ సిద్ధం చేస్తే కాంగ్రెస్ అంచనాలు పెంచింది: కేటీఆర్

KTR Criticizes Congress Over Musi River Development Plan
  • ప్రజల సొమ్మును దోచుకోవడానికి సిద్ధమవుతోందని విమర్శ
  • రూ. 16,000 కోట్లతో మాస్టర్ ప్లాన్, డీపీఆర్ సిద్ధం చేశామన్న కేటీఆర్
  • కాంగ్రెస్ ప్రభుత్వం అంచనాలను రూ. 1.50 లక్షల కోట్లకు పెంచిందని ఆరోపణ
మూసీ నది ప్రక్షాళన, సుందరీకరణ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సొమ్మును దోచుకోవడానికి సిద్ధమవుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం మూసీ అభివృద్ధి కోసం అన్ని ఏర్పాట్లు చేసి మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసిందని, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అంచనాలను భారీగా పెంచి దోపిడీకి తెరలేపిందని ఆయన విమర్శించారు.

మూసీ నది అభివృద్ధి కోసం అన్నీ సిద్ధం చేసి రూ. 16,000 కోట్లతో మాస్టర్ ప్లాన్, డీపీఆర్ తయారు చేస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం అంచనాలను రూ. 1.50 లక్షల కోట్లకు పెంచడం శోచనీయమని ఆయన అన్నారు. ప్రజాధనం దుర్వినియోగాన్ని తాము కచ్చితంగా అడ్డుకుంటామని ఆయన స్పష్టం చేశారు. నాగోల్ ప్రాంతంలో ఐదు కిలోమీటర్ల మేర సుందరీకరణ పనులు పూర్తి చేయడంతో పాటు ఉప్పల్ భగాయత్‌లో శిల్పారామాన్ని ఏర్పాటు చేశామని ఆయన గుర్తు చేశారు.

కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి నీటిని హైదరాబాద్ సమీపంలోని కొండపోచమ్మ సాగర్‌కు బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకువచ్చిందని తెలిపారు. అక్కడి నుంచి గండిపేట చెరువుకు తరలించడానికి 2022లోనే రూ. 1,100 కోట్లతో అనుమతులు కూడా మంజూరు చేశారని గుర్తు చేశారు. మూసీలోకి చేరే 2000 ఎంఎల్డీ మురుగునీటి శుద్ధి కోసం 36 ఎస్టీపీల నిర్మాణాన్ని చేపట్టి పూర్తిచేసినట్లు ఆయన వెల్లడించారు.
KTR
KTR BRS
Musi River
Musi River Development
Telangana
KCR
Congress Party
Hyderabad

More Telugu News