Rajinikanth: 'జైలర్ 2' .. ఈ సారి నెక్స్ట్ లెవెల్!

jailer 2 Movie Update
  • బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన 'జైలర్'
  • 600 కోట్లకి పైగా రాబట్టిన వసూళ్లు
  • చకచకా షూటింగు జరుపుకుంటున్న సీక్వెల్ 
  • కీలకమైన పాత్రలో ఎస్ జే సూర్య

రజనీకాంత్ కి రికార్డ్ స్థాయి వసూళ్లు .. భారీ విజయాలు కొత్తకాదు. ఆయన అందుకున్న చెప్పుకోదగిన విజయాలలో 'జైలర్' తప్పకుండా కనిపిస్తుంది. ఎందుకంటే ఈ సినిమాలో రజనీ మార్క్ స్టైల్ .. రజనీ మార్క్ ఎంటర్టైన్ మెంట్ తో పాటు, ఆలోచింపజేసే సందేశం ఉంది. సమాజానికి హానికరంగా మారుతున్నప్పుడు, కన్న కొడుకును కూడా కలుపుమొక్కలా తీసిపారేయాలనే సందేశంతో ఈ సినిమా ఎమోషనల్ గా కనెక్ట్ అయింది. 

నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, 2023లో థియేటర్లకు వచ్చింది. 200 కోట్ల బడ్జెట్ తో నిర్మితమైన ఈ సినిమా, 600 కోట్లకి పైగా వసూళ్లను రాబట్టింది. కథాకథనాలు .. అనిరుధ్ సంగీతం .. భారీతారాగణం ఈ సినిమాకి ప్రధానమైన ఆకర్షణగా నిలిచాయి. అలాంటి ఆ సినిమాకి ఇప్పుడు సీక్వెల్ రెడీ అవుతోంది.

'జైలర్' ఫస్టు పార్టుకు ఏ మాత్రం తగ్గని కథను నెల్సన్ దిలీప్ కుమార్ తయారు చేసినట్టుగా వార్తలు వచ్చాయి. ప్రస్తుతం ఈ సినిమా చాలా వేగంగా షూటింగు జరుపుకుంటున్నట్టుగా తెలుస్తోంది. నెక్స్ట్ షెడ్యూల్లో ఎస్.జె. సూర్య జాయిన్ కానున్నట్టుగా చెబుతున్నారు. నెగెటివ్ షేడ్స్ తో కూడిన ఒక పవర్ఫుల్ రోల్ ను ఈ సినిమాలో ఆయన చేయనున్నట్టుగా  సమాచారం. మరి ఈ సినిమా 'జైలర్'ను మించి ఉంటుందా లేదా అనేది చూడాలి. 

Rajinikanth
Jailer 2
Jailer movie
Nelson Dilipkumar
SJ Surya
Tamil cinema
Anirudh Ravichander
Kollywood
Sequel
Action movie

More Telugu News