Chandrababu Naidu: సీఎం చంద్రబాబును కలిసిన పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ విజేతలు
- పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ విజేతలకు సీఎం అభినందనలు
- ఉండవల్లి నివాసంలో కడప జిల్లా నేతలతో చంద్రబాబు భేటీ
- ఈ గెలుపు ప్రజాస్వామ్య విజయమని వ్యాఖ్య
- నేతల సమష్టి కృషితోనే విజయం సాధ్యమైందని ప్రశంస
- ఇదే స్ఫూర్తిని భవిష్యత్తులోనూ కొనసాగించాలని పిలుపు
కడప జిల్లా పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ స్థానాల్లో ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో కూటమి బలపరిచిన టీడీపీ అభ్యర్థులు విజయం సాధించడం తెలిసిందే. పులివెందుల నుంచి బీటెక్ రవి అర్ధాంగి లతారెడ్డి, ఒంటిమిట్ట నుంచి ముద్దుకృష్ణారెడ్డి గెలుపొందారు. ఈ నేపథ్యంలో, నేడు లతారెడ్డి, ముద్దుకృష్ణారెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి ఆయన ఆశీస్సులు అందుకున్నారు. ఈ విజయం ప్రజాస్వామ్య విజయమని ముఖ్యమంత్రి చంద్రబాబు అభివర్ణించారు. ఈ మేరకు ఉండవల్లిలోని తన నివాసంలో గురువారం ఆయన కడప జిల్లా నేతలు, కార్యకర్తలతో సమావేశమయ్యారు.
ఈ ఉప ఎన్నికల్లో పులివెందుల నుంచి గెలుపొందిన లతారెడ్డి, ఒంటిమిట్ట నుంచి విజయం సాధించిన కృష్ణారెడ్డిని ముఖ్యమంత్రి ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. నేతలంతా సమష్టిగా కృషి చేయడం, కార్యకర్తలను సమన్వయం చేసుకుని ముందుకు సాగడం వల్లే ఈ అద్భుత ఫలితాలు సాధ్యమయ్యాయని ప్రశంసించారు. పార్టీ శ్రేణుల కష్టానికి తగిన ప్రతిఫలం దక్కిందని అన్నారు.
ఈ గెలుపుతో వచ్చిన స్ఫూర్తిని భవిష్యత్తులో కూడా కొనసాగించాలని ఆయన పార్టీ నేతలకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కడప జిల్లా, పులివెందుల నియోజకవర్గానికి చెందిన పలువురు కీలక నేతలు, కార్యకర్తలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. విజేతలతో కలిసి తమ సంతోషాన్ని ముఖ్యమంత్రితో పంచుకున్నారు.