Kajol: రేపు ఓటీటీకి వస్తున్న హారర్ థ్రిల్లర్ .. 'మా'

Maa Movie Update
  • హిందీలో విడుదలైన 'మా'
  • ప్రధానమైన పాత్రలో మెప్పించిన కాజోల్
  • దెయ్యం చుట్టూ తిరిగే హారర్ థ్రిల్లర్ 
  • ఈ నెల 22 నుంచి నెట్ ఫ్లిక్స్ లో  

కాజోల్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పనిలేదు. ఏ పాత్రను పోషించినా ఆమె ఆ పాత్రలో ఒదిగిపోతుంది. అలాంటి కాజోల్ కి ఈ మధ్య కాలంలో మరింత పేరు తీసుకొచ్చిన సినిమాగా 'మా' కనిపిస్తుంది. అజయ్ దేవగణ్ ఒక నిర్మాణ భాగస్వామిగా వ్యవహరించిన ఈ సినిమా, జూన్ 27వ తేదీన థియేటర్లకు వచ్చింది.

సాధారణంగా ఏ తల్లి అయినా తన బిడ్డను కాపాడుకోవడానికి మొదటి ప్రాధాన్యతను ఇస్తుంది. అందుకోసం ఎంత కష్టపడటానికైనా .. ఎంతగా తెగించడానికైనా వెనుకడుగు వేయదు. అలాంటి ఒక తల్లి ఒక దెయ్యం బారి నుంచి తన కూతురును కాపాడుకోవడం కోసం చేసిన ప్రయత్నంగా 'మా' కనిపిస్తుంది. తన బిడ్డ కోసం ఒక తల్లి దుష్టశక్తిని ఎలా ఎదుర్కొంది? అనే నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. 

కాజోల్ ప్రధానమైన పాత్రను పోషించిన ఈ సినిమా, ఈ నెల 22వ తేదీ నుంచి 'నెట్ ఫ్లిక్స్' లో స్ట్రీమింగ్ కానుంది. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. ఇతర ముఖ్యమైన పాత్రలలో తనూజ దేవగణ్ .. రోనిత్ రాయ్ .. ఇంద్రనీల్ సేన్ గుప్తా .. జితేంద్ర కుమార్ కనిపించనున్నారు. 50 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, ఓటీటీ వైపు నుంచి ఏ స్థాయిలో మెప్పిస్తుందనేదనేది చూడాలి. 
Kajol
Maa movie
Kajol movie Maa
Netflix
Horror thriller movie
Bollywood movie
Ajay Devgn
Tanuja Devgan
Ronit Roy

More Telugu News