Telangana Police Constable: కానిస్టేబుల్ నియామకంలో నకిలీ సర్టిఫికెట్ల కలకలం
- తప్పుడు పత్రాలతో ఉద్యోగాల్లో చేరిన యువకులు
- శిక్షణ నిలిపివేసి చర్యలకు సిద్దమైన పోలీస్ శాఖ
- హైదరాబాద్ లో 59 మందిపై కేసు నమోదు
తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ కానిస్టేబుల్ నియామకాల్లో నకిలీ సర్టిఫికెట్ల వ్యవహారం కలకలం రేపింది. 2022 లో జారీ చేసిన కానిస్టేబుల్ నోటిఫికేషన్ ద్వారా పలువురు అభ్యర్థులు తప్పుడు పత్రాలతో ఉద్యోగాలు పొందారని తేలింది. మొత్తంగా 59 మంది అభ్యర్థులు ఇప్పటికే ఉద్యోగంలో చేరి శిక్షణ పొందుతున్నట్లు బయటపడింది. సర్టిఫికెట్ వెరిఫికేషన్ లో సదరు అభ్యర్థులు సమర్పించిన బోనఫైడ్ సర్టిఫికెట్లు నకిలీవని ఉన్నతాధికారులు గుర్తించారు. దీంతో సదరు కానిస్టేబుల్ అభ్యర్థులకు శిక్షణ నిలిపివేసి చర్యలకు సిద్దమవుతున్నారు. రిక్రూట్ మెంట్ బోర్డును మోసం చేశారని 59 మంది అభ్యర్థులపై పోలీసులు కేసు నమోదు చేశారు.