Nanobyte: హ్యాకర్ నే హ్యాక్ చేసి మోసం బయటపెట్టిన టెకీ.. యూపీలో ఘటన

UP Techie Exposes Microsoft Tech Support Scam by Hacking Hacker
  • మైక్రోసాఫ్ట్ టెక్ సపోర్ట్ పేరుతో సైబర్ మోసాలకు పాల్పడుతున్న యువకుడు
  • ఓ టెకీని మోసం చేసేందుకు ప్రయత్నించిన రాయ్ బరేలీ వాసి
  • రివర్స్ హ్యాక్ చేసి ఫొటోతో పాటు వివరాలన్నీ నెట్ లో పెట్టిన టెకీ
మైక్రోసాఫ్ట్ టెక్ సపోర్ట్ పేరుతో తనను మోసగించాలని ప్రయత్నించిన సైబర్ నేరస్థుడికి ఓ టెకీ దిమ్మ తిరిగే షాక్ ఇచ్చాడు. సదరు సైబర్ నేరస్థుడి ల్యాప్ టాప్ ను హ్యాక్ చేసి అతడి వివరాలన్నీ రాబట్టాడు. పేరు, ఫొటో, చిరునామా వంటి వివరాలన్నీ సేకరించి పోలీసులకు చేరవేశాడు. అమాయకులను మోసం చేసి వారి బ్యాంకు ఖాతాలలోని డబ్బును కాజేస్తున్న ఇలాంటి నేరస్థులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు విజ్ఞప్తి చేశాడు. ఈ వివరాలన్నీ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశాడు.

వివరాల్లోకి వెళితే..
నానోబైటర్ అనే ‘ఎక్స్’ యూజర్ ఇటీవల తనకు ఎదురైన అనుభవాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నాడు. ఓ స్కామర్ తనను మోసం చేయడానికి ప్రయత్నించగా తానే తిరిగి అతడి ల్యాప్ టాప్ ను హ్యాక్ చేశానని వివరించాడు. ల్యాప్ టాప్ కెమెరా సాయంతో సదరు స్కామర్ కదలికలు మొత్తం రికార్డు చేసినట్లు తెలిపాడు. స్కామర్ యూజ్ చేస్తున్న వైఫై కనెక్షన్ ఆధారంగా.. స్కామర్ పేరు గౌరవ్ త్రివేదీ అని, ఉత్తరప్రదేశ్ లోని రాయ్ బరేలీలో ఓ అపార్ట్ మెంట్ లో ఉంటున్నాడని వెల్లడించాడు. 

మైక్రోసాఫ్ట్ టెక్ సపోర్ట్ పేరిట అమాయకులను మోసం చేసి వారి బ్యాంకు ఖాతాలను ఖాళీ చేస్తున్నాడని ఆరోపించాడు. తాను వెబ్ క్యామ్ తో త్రివేదీ ఫొటో తీశానని, లైవ్ లొకేషన్ కూడా గుర్తించానని వివరించాడు. ఈ వివరాలన్నీ పోలీసులకు పంపించి చర్యలు తీసుకోవాలని కోరానన్నాడు. కాగా, నానోబైటర్ ఫిర్యాదు, ఆయన అందించిన సమాచారాన్ని పరిశీలించిన సైబర్ పోలీసులు.. స్కామర్ పై చర్యలు తీసుకుంటామని సోషల్ మీడియాలో జవాబిచ్చారు.
Nanobyte
cybercrime
cyber security
tech support scam
Uttar Pradesh
Rai Bareli
Gaurav Trivedi
hacking
reverse hacking
online fraud

More Telugu News