Revanth Reddy: 17వ రోజుకు చేరుకున్న సినీ కార్మికుల సమ్మె... సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం

Revanth Reddy Government Intervenes in Film Workers Strike
  • రంగంలోకి దిగిన తెలంగాణ ప్రభుత్వం
  • సినిమా హబ్ లక్ష్యానికి దెబ్బ అని సర్కార్ ఆందోళన
  • ఫెడరేషన్ నేతలతో మాట్లాడనున్న డీజీపీ
గత 17 రోజులుగా హైదరాబాద్‌లో కొనసాగుతున్న సినీ కార్మికుల సమ్మె వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వం జోక్యం చేసుకుంది. సమ్మె కారణంగా తెలుగుతో పాటు ఇతర భాషల సినిమా షూటింగులు కూడా నిలిచిపోవడంతో ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని ముఖ్యమంత్రి ఉన్నతాధికారులను ఆదేశించారు. ప్రభుత్వ జోక్యంతో ఈ రోజు కీలక పరిణామాలు చోటుచేసుకోనున్నాయి.

హైదరాబాద్‌ను దేశంలోనే ప్రధాన సినిమా హబ్‌గా మార్చాలన్న ప్రభుత్వ లక్ష్యానికి ఈ సమ్మె అడ్డంకిగా మారిందని అధికారులు భావిస్తున్నారు. రాష్ట్ర సినిమా పాలసీపై కూడా ఇది తీవ్ర ప్రభావం చూపుతుందని ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. ఈ నేపథ్యంలో, సమస్య పరిష్కారానికి అధికారులు ఇప్పటికే ఫిల్మ్ ఛాంబర్ ప్రతినిధులతో ఒక విడత చర్చలు జరిపారు. దీనికి కొనసాగింపుగా, ఈరోజు ఫెడరేషన్ నాయకులతో కూడా సమావేశం కానున్నారు. డీజీపీ సైతం ఫెడరేషన్ నేతలతో మాట్లాడనున్నట్లు తెలుస్తోంది.
Revanth Reddy
Telangana government
Telugu cinema
Film workers strike
Hyderabad film industry
Film Chamber
Federation leaders
Movie shootings

More Telugu News