Kaleshwaram: కాళేశ్వరం వద్ద ఉద్ధృతంగా ప్రవహిస్తోన్న గోదావరి... నీట మునిగిన జ్ఞానదీపాలు

Godavari River Swells at Kaleshwaram Gyanadeepa Submerged
  • కాళేశ్వరం వద్ద 12.41 మీటర్లకు చేరుకున్న నీటిమట్టం
  • కొంతమేర నీట మునిగిన పుష్కర్ ఘాట్ మెట్ల వద్ద జ్ఞానదీపాలు
  • పరిసర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచన
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా తెలంగాణలోని కాళేశ్వరం వద్ద గోదావరి నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. కాళేశ్వరం వద్ద నీటి మట్టం 12.41 మీటర్లకు చేరడంతో పుష్కర ఘాట్ మెట్ల వద్ద ఏర్పాటు చేసిన జ్ఞానదీపాలు కొంతమేరకు నీటిలో మునిగాయి. త్రివేణి సంగమం వద్ద వరద ప్రవాహం అధికంగా ఉండటంతో పరిసర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

మెదక్ జిల్లాలోని పుణ్యక్షేత్రం ఏడుపాయల వనదుర్గా భవానీ ఆలయం వారం రోజులుగా జలదిగ్బంధంలో ఉంది. రాజగోపురంలో ఉత్సవ విగ్రహాన్ని ఏర్పాటు చేసి భక్తులకు అమ్మవారి దర్శనం కల్పిస్తున్నారు.

సింగూరు నుంచి నీటిని దిగువకు విడుదల చేయడంతో పాటు నక్క వాగు ప్రవాహంతో వనదుర్గ ఆనకట్టకు భారీగా వరద పోటెత్తుతోంది. వనదుర్గ ఆనకట్ట మీదుగా 50,985 క్యూసెక్కుల వరద నీటిని విడుదల చేస్తున్నారు. వనదుర్గ ఆనకట్ట, గర్భగుడికి ఎవరూ వెళ్లకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు.
Kaleshwaram
Godavari River
Telangana Floods
Kaleshwaram Project
Edupala Temple
Medak District

More Telugu News