Gavin Newsom: కాలిఫోర్నియా ప్రమాదంపై గవర్నర్, ట్రంప్ పాలనా యంత్రాంగం మధ్య మాటల యుద్ధం

California Governor Faces Trump Criticism After Fatal Accident
  • అక్రమ వలసదారులకు లైసెన్స్ ఇచ్చి అమెరికన్ల ప్రాణాలు తీస్తున్నారన్న ట్రంప్ కార్యాలయం
  • ట్రంప్ హయాంలోనే ఆ డ్రైవర్ అమెరికాకు వలస వచ్చాడంటూ తిప్పికొట్టిన గవర్నర్
  • రాంగ్ యూటర్న్ తీసుకుంటూ ప్రమాదానికి కారణమైన భారత సంతతి డ్రైవర్
అమెరికాలోని కాలిఫోర్నియాలో జరిగిన ఓ ఘోర ప్రమాదం ప్రస్తుతం ఆ రాష్ట్ర గవర్నర్ కు, దేశ అధ్యక్షుడి పాలనా యంత్రాంగం మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. అక్రమ వలసదారులకు డ్రైవింగ్ లైసెన్స్ ఇస్తూ అమెరికన్ల ప్రాణాలు తీస్తున్నారంటూ కాలిఫోర్నియా గవర్నర్ గవిన్ న్యూసమ్ పై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కార్యాలయం తీవ్రంగా మండిపడింది. గవిన్ తీరు సరిగా లేదని ఆరోపించారు. 

ఇంకెంతమంది అమెరికన్లు ప్రాణాలు కోల్పోవాలంటూ సోషల్ మీడియా వేదికగా హోంలాండ్ సెక్యూరిటీ ప్రశ్నించింది. అయితే, సదరు డ్రైవర్ ట్రంప్ పాలనలోనే అక్రమంగా దేశంలోకి అడుగుపెట్టాడని, అక్రమ చొరబాట్లను అడ్డుకోవడంలో ఆయన విఫలమయ్యారని గవిన్ కౌంటర్ ఇచ్చారు. ఈ ప్రమాదానికి నువ్వంటే నువ్వే కారణమని పరస్పరం విమర్శలు చేసుకుంటున్నారు. అతడి ఇమిగ్రేషన్ స్టేటస్ ప్రస్తుతం పరిశీలనలో ఉందని, స్థానిక చట్టాల ప్రకారమే లైసెన్స్ మంజూరు చేశామని గవిన్ న్యూసమ్ స్పష్టం చేశారు.
 
అసలేం జరిగిందంటే..
భారత సంతతికి చెందిన హర్జిందర్ సింగ్ అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించి అక్కడే ఉండిపోయాడు. కాలిఫోర్నియాలో డ్రైవింగ్ లైసెన్స్ తీసుకుని ట్రక్ డ్రైవర్ గా స్థిరపడ్డాడు. ఈ క్రమంలో ఫ్లోరిడా హైవేపై కంటైనర్ ట్రక్కు నడుపుతూ రాంగ్ యూటర్న్ తీసుకున్నాడు. దీంతో వెనకే వచ్చిన ఓ కారు అదుపుతప్పి కంటైనర్ ను ఢీ కొట్టింది. ప్రమాద తీవ్రతకు కారులోని ముగ్గురు అమెరికన్లు అక్కడికక్కడే మరణించారు. కారు మొత్తం ధ్వంసమైంది. ఈ ప్రమాదంపై ట్రంప్ కార్యాలయం స్పందిస్తూ.. అమెరికాలో అక్రమంగా ఉంటున్న హర్జిందర్ సింగ్ కు డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వకుంటే ఈ ప్రమాదం జరిగేది కాదని కాలిఫోర్నియా గవర్నర్ ను నిందించింది.
Gavin Newsom
California accident
Donald Trump
Harjinder Singh
illegal immigration
US accident
driving license
Florida highway accident
US politics

More Telugu News