Shodha Series: అడుగడుగునా సస్పెన్స్ .. ఓటీటీకి కన్నడ మిస్టరీ థ్రిల్లర్!

Shodha Series Update
  • కన్నడ నుంచి మరో సిరీస్ 
  • టైటిల్ తోనే ఆసక్తిని పెంచిన 'శోధ'
  • 6 ఎపిసోడ్స్ గా అందుబాటులోకి
  • ప్రధానమైన పాత్రలో పవన్ కుమార్  
  • ఈ నెల 22 నుంచి జీ 5లో స్ట్రీమింగ్ 

ఈ మధ్య కాలంలో కన్నడ నుంచి కూడా వెబ్ సిరీస్ లు రావడం మొదలైంది. అలా ఇటీవల వచ్చిన 'అయ్యనా మానే' సిరీస్ ఆడియన్స్ కి ఒక రేంజ్ లో కనెక్ట్ అయింది. అత్తవారింటికి వచ్చిన ఒక కొత్తకోడలు అక్కడ ఎలాంటి పరిస్థితులను ఫేస్ చేసింది అనేది ఆ సిరీస్ కథ. ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి ఈ సిరీస్ కి మంచి మద్దతు లభించింది. ఈ నేపథ్యంలో కన్నడ నుంచి మరో సిరీస్ వస్తోంది .. ఆ సిరీస్ పేరే 'శోధ'.

'శోధ' సిరీస్ కూడా జీ 5 వేదికపైనే స్ట్రీమింగ్ కానుంది. ఈ నెల 22వ తేదీ నుంచి ఈ సిరీస్ అందుబాటులోకి రానుంది. అయితే కన్నడతో పాటు ఇతర భాషలలోను అందుబాటులోకి తెస్తారా? లేదంటే ప్రస్తుతానికి కన్నడలో మాత్రమే స్ట్రీమింగ్ అవుతుందా? అనే విషయం తెలియాల్సి ఉంది. సునీల్ మైసూర్ ఈ సిరీస్ కి దర్శకుడిగా వ్యవహరించాడు. రచయితగా .. దర్శకుడుగా మంచి పేరు తెచ్చుకున్న పవన్ కుమార్, ఈ సిరీస్ లో ప్రధానమైన పాత్రను పోషించాడు. మిగతా పాత్రలలో అరుణసాగర్ .. అనూష రంగనాథ్ .. శ్వేతా ప్రసాద్ .. దియా హెగ్డే కనిపించనున్నారు. 

కథ విషయానికి వస్తే, కథానాయకుడు రోహిత్ తన భార్య విషయంలో ఒక అయోమయంలో ఉంటాడు. తనతో ఉన్నది తన భార్య కాదనీ, ఆమెను వెతికి పెట్టమని కోరుతూ తిరుగుతూ ఉంటాడు. అయితే అందరూ కూడా ఆయన మానసిక స్థితి సరిగ్గా లేదని భావిస్తారు. ఆయన అసలు భార్య ఎవరు? అలా నమ్మిస్తున్నది ఎవరు? అనేది కథ. సుహాస్ నవరత్న రాసిన కథ ఆధారంగా రూపొందిన ఈ సిరీస్, 6 ఎపిసోడ్స్ గా ప్రేక్షకుల ముందుకు రానుంది. 
Shodha Series
Kannada web series
ZEE5
Sunil Mysore
Pawan Kumar
mystery thriller
Aruna Sagar
Anusha Ranganath
suspense thriller

More Telugu News