Sohail: చెకప్ కోసం తీసుకెళితే తప్పించుకుని పారిపోయిన ఖైదీ.. గాంధీ ఆసుపత్రిలో ఘటన

Robbery Accused Sohail Escapes Police Custody at Gandhi Hospital
––
దోపిడీ కేసులో అరెస్టు చేసిన నిందితుడిని వైద్య పరీక్షల కోసం పోలీసులు ఆసుపత్రికి తీసుకెళ్లగా.. టాయిలెట్ కి వెళ్లి వస్తానని చెప్పి పరారయ్యాడు. సికింద్రాబాద్ లోని గాంధీ ఆసుపత్రిలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రెండు రోజుల క్రితం సోహైల్‌ అనే వ్యక్తిని ఓ దోపిడీ కేసులో అరెస్టు చేశారు. చర్లపల్లి జైలుకు తరలించే క్రమంలో నిబంధనల మేరకు వైద్య పరీక్షలు నిర్వహించేందుకు గాంధీ ఆసుపత్రికి తీసుకొచ్చారు.

ఈ క్రమంలో టాయిలెట్ కని చెప్పి వెళ్లిన సోహైల్.. వెంటిలేటర్ నుంచి దూకి పారిపోయాడు. దీంతో మరో కేసు నమోదు చేసిన పోలీసులు.. సోహైల్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కాగా, దోపిడీతో పాటు పలు ఇతర కేసుల్లోనూ సోహైల్ నిందితుడని అధికారులు తెలిపారు.
Sohail
Sohail Escape
Gandhi Hospital
Secunderabad
Charlapally Jail
Robbery Case
Prisoner Escape
Telangana Crime News

More Telugu News