Mumbai Rains: భారీ వర్షాలతో ముంబై అతలాకుతలం.. మునిగిన రోడ్లు.. 250కిపైగా విమానాల ఆలస్యం
- ముంబై నగరాన్ని ముంచెత్తిన భారీ వర్షాలు
- నగరానికి రెడ్ అలర్ట్ జారీ చేసిన ఐఎండీ
- స్కూళ్లు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ప్రకటన
- వందలాది విమానాల రాకపోకలు ఆలస్యం
- రైళ్ల సర్వీసులపై తీవ్ర ప్రభావం.. పలు రైళ్లు ఆలస్యం
- పలు ప్రాంతాలు నీట మునక
దేశ ఆర్థిక రాజధాని ముంబైని భారీ వర్షాలు ముంచెత్తాయి. ఈ తెల్లవారుజాము నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కుండపోత వానలతో నగరం అతలాకుతలమైంది. జనజీవనం పూర్తిగా స్తంభించిపోగా, భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ముంబై నగరానికి, శివారు ప్రాంతాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది.
ఈ నేపథ్యంలో బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) కీలక నిర్ణయం తీసుకుంది. అత్యవసర సేవలు మినహా అన్ని ప్రభుత్వ, సెమీ-ప్రభుత్వ, బీఎంసీ కార్యాలయాలకు నేడు సెలవు ప్రకటించింది. ప్రైవేట్ సంస్థలు కూడా తమ ఉద్యోగులకు వీలైనంత వరకు వర్క్ ఫ్రం హోం సదుపాయం కల్పించాలని, అనవసర ప్రయాణాలు చేయవద్దని బీఎంసీ గట్టిగా సూచించింది. భారీ వర్షాల కారణంగా ముంబైలోని పాఠశాలలు, కళాశాలలకు కూడా సెలవు ప్రకటించారు.
భారీ వర్షాల ప్రభావం రవాణా వ్యవస్థపై తీవ్రంగా పడింది. సెంట్రల్ రైల్వే లైన్‌లో రైళ్లు 20 నుంచి 30 నిమిషాలకు పైగా ఆలస్యంగా నడుస్తున్నాయి. ముంబై విమానాశ్రయం నుంచి బయలుదేరాల్సిన 155 విమానాలు, నగరానికి రావాల్సిన 102 విమానాలు ఆలస్యమైనట్లు ఫ్లైట్ రాడార్ డేటా వెల్లడించింది. వర్షాల కారణంగా కార్యకలాపాలకు ఆటంకం కలుగుతోందని, విమానాల రాకపోకల్లో జాప్యం జరుగుతోందని ఇండిగో సంస్థ కూడా ఓ ప్రకటనలో తెలిపింది.
నగరంలోని అనేక ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. అంధేరి వెస్ట్‌లోని ఎస్వీ రోడ్డులో వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. సియాన్‌లోని గాంధీ మార్కెట్, దాదర్ టీటీ, ముంబై సెంట్రల్ వంటి ప్రాంతాల్లో రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. వసాయిలోని మితాఘర్ ప్రాంతంలో వరద నీటిలో దాదాపు 200 నుంచి 400 మంది చిక్కుకున్నట్లు సమాచారం. నేటి ఉదయం 8 గంటలతో ముగిసిన 24 గంటల వ్యవధిలో విఖ్రోలిలో అత్యధికంగా 255.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, బైకుల్లాలో 241.0 మి.మీ., శాంతాక్రూజ్‌లో 238.2 మి.మీ. వర్షం కురిసింది.