ఆ స్టార్ హీరోతో షూటింగ్ అంత ఈజీ కాదు: మురుగదాస్
- ఒకప్పుడు భారీ హిట్స్ ఇచ్చిన మురుగదాస్
- కోలీవుడ్ కి కొత్త టేకింగ్ ను పరిచయం చేసిన డైరెక్టర్
- ఈ మధ్య కాలంలో పలకరించని సక్సెస్
- పరాజయం పాలైన 'సికందర్'
- అసహనంతో ఉన్న మురుగదాస్
తమిళ .. తెలుగు స్టార్స్ తో మాత్రమే కాదు, బాలీవుడ్ సీనియర్ స్టార్స్ తోను కలిసి పనిచేసిన అనుభవం ఆయనకి ఉంది. అయితే ఎప్పుడూ కూడా ఆయన ఏ హీరో గురించి ఎక్కడా అసహనాన్ని వ్యక్తం చేసింది లేదు. కానీ తాజాగా ఒక ఇంటర్యూలో మాట్లాడుతూ, ఒక బాలీవుడ్ స్టార్ హీరో గురించి ప్రస్తావించాడు. ఆ హీరో రాత్రి 8 గంటలకు షూటింగుకు వచ్చేవారు. పగలు చేయవలసిన సన్నివేశాలను కూడా రాత్రివేళలో షూట్ చేయవలసి వచ్చేది. అందుకోసం నానా తిప్పలు పడేవాళ్లం" అని అన్నాడు.
" ఆ సమయంలో పిల్లల కాంబినేషన్ లోని సన్నివేశాలను చిత్రీకరించడం కష్టంగా ఉండేది. ఆ సమయానికి వాళ్లు చాలా అలసిపోయేవారు. ఆ హీరో టైమింగ్స్ కారణంగా ఆయనతో పని చేయడం అంత ఈజీ కాదని అనిపించింది" అని చెప్పాడు. ఇటీవల సల్మాన్ తో మురుగదాస్ 'సికందర్' సినిమాను తెరకెక్కించాడు. ఆ సినిమా పరాజయం పాలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సల్మాన్ ను ఉద్దేశించే మురుగదాస్ ఈ మాట అన్నాడనే టాక్ వినిపిస్తోంది.