Vijay Deverakonda: ఒకే ఈవెంట్‌లో మెరిసిన విజ‌య్‌-ర‌ష్మిక‌.. ఇదిగో వీడియో

Vijay Deverakonda and Rashmika Shine at India Day Parade
  • న్యూయార్క్‌లో ఘ‌నంగా వార్షిక 'ఇండియా డే పరేడ్'
  • భారత 79వ స్వాతంత్య్ర‌ దినోత్సవం సంద‌ర్భంగా భారత కాన్సులేట్ ఆధ్వర్యంలో ఈవెంట్‌
  • ప్ర‌త్యేక అతిథులుగా హాజరైన విజ‌య్‌, ర‌ష్మిక‌
  • నెట్టింట ఈ జంట ఫొటోలు, వీడియోల వైర‌ల్  
అమెరికాలోని న్యూయార్క్‌లో నిర్వహించిన వార్షిక 'ఇండియా డే పరేడ్' ఘ‌నంగా జరిగింది. భారతదేశ స్వాతంత్య్ర దినోత్సవాన్ని జాతీయ ఉత్సవాలుగా జరుపుకునే క్ర‌మంలో ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్స్ ప్రతి ఏటా ఈ పరేడ్‌ను నిర్వహిస్తోంది. భారత 79వ స్వాతంత్య్ర‌ దినోత్సవాన్ని పురస్కరించుకుని భారత కాన్సులేట్ ఆధ్వర్యంలో అమెరికాలో అతిపెద్ద భారతీయ పరేడ్ అయిన 'ఇండియా డే పరేడ్'ను ఈసారి కూడా అంతే ఘనంగా నిర్వహించారు. 

ఈ వేడుకకు వేలాదిమంది భారతీయ అమెరికన్లు హాజరయ్యారు. ప్రముఖ సినీతారలు రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ ఈ కార్యక్రమానికి ప్ర‌త్యేక అతిథులుగా హాజరై పరేడ్‌కి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. కొన్ని రోజులుగా ఈ జంట రిలేష‌న్‌లో ఉందంటూ పుకార్లు చ‌క్క‌ర్లు కొడుతున్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో విజ‌య్‌-ర‌ష్మిక తాలూకు న్యూయార్క్ ప‌రేడ్ ఫొటోలు, వీడియోలు ఇప్పుడు మ‌రోసారి నెట్టింట‌ వైర‌ల్ అవుతున్నాయి.

ఇక‌, ఈ జంట 'గీత గోవిందం',  'డియ‌ర్ కామ్రేడ్' వంటి చిత్రాల్లో క‌లిసి న‌టించిన విష‌యం తెలిసిందే. అయితే, త్వ‌ర‌లోనే ర‌ష్మిక‌, విజ‌య్ హీరోహీరోయిన్లుగా మ‌రో మూవీ తెర‌కెక్క‌నున్న‌ట్లు తెలుస్తోంది. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు రాహుల్ సంకృత్యాయన్ ద‌ర్శ‌క‌త్వంలో మ‌రోసారి ఈ జంట అభిమానుల‌కు క‌నువిందు చేయ‌నుందని స‌మాచారం. పీరియాడిక్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా రానున్న ఈ ప్రాజెక్ట్‌ను ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మించ‌నుంది. 
Vijay Deverakonda
Rashmika Mandanna
India Day Parade
New York
Indian Americans
Geetha Govindam
Dear Comrade
Rahul Sankrityan
Maitree Movie Makers
Telugu Movies

More Telugu News