Pawan Kalyan: పవన్ కల్యాణ్ ను 'పొలిటికల్ తుఫాన్'గా అభివర్ణించిన రజనీకాంత్

Rajinikanth praises Pawan Kalyan as Political Toofan
  • రజనీకాంత్ కెరీర్ కు 50 ఏళ్లు
  • శుభాకాంక్షలు తెలియజేసిన పవన్ కల్యాణ్
  • నా ప్రియమైన సోదరుడు అంటూ తలైవా రిప్లయ్
ఇద్దరు అగ్ర కథానాయకులు, ఒకరు సినీ ప్రపంచాన్ని ఏలుతున్న సూపర్ స్టార్, మరొకరు అటు సినిమా రంగంతో పాటు ఇటు రాజకీయాల్లోనూ కీలక శక్తిగా ఎదిగిన నేత. వీరిద్దరి మధ్య సోషల్ మీడియా వేదికగా జరిగిన ఓ ఆత్మీయ సంభాషణ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను ఉద్దేశించి సూపర్ స్టార్ రజినీకాంత్ చేసిన ఓ ట్వీట్, దానికి పవన్ ఇచ్చిన వినమ్రమైన సమాధానం వారి అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.

రజనీకాంత్ సినీ కెరీర్ లో 50 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు తెలియజేశారు. అందుకు ప్రతిస్పందనగా రజినీకాంత్ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. "ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, నా ప్రియమైన సోదరుడు, రాజకీయ తుఫాన్ పవన్ కల్యాణ్ గారూ.. మీ ఆత్మీయ శుభాకాంక్షలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. దేవుడి ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉండాలి" అని తన పోస్టులో పేర్కొన్నారు. పవన్‌ను తలైవా 'పొలిటికల్ తుఫాన్' అని సంబోధించడం ఈ పోస్టులో ప్రధాన ఆకర్షణగా నిలిచింది.

రజినీకాంత్ ప్రశంసలకు పవన్ కల్యాణ్ ఎంతో గౌరవపూర్వకంగా స్పందించారు. "గౌరవనీయులైన రజినీకాంత్ గారూ.. పెద్దన్న సమానులైన మీకు నమస్కారాలు. మీ ప్రేమపూర్వక మాటలకు, ఆశీస్సులకు నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. వాటిని నా హృదయంలో ఎంతో గౌరవంతో పదిలంగా దాచుకుంటాను. మీరు సంపూర్ణ ఆరోగ్యంతో, విజయాలతో మీ ప్రస్థానాన్ని కొనసాగించాలని కోరుకుంటున్నాను," అని బదులిచ్చారు. ప్రస్తుతం ఈ ఇద్దరు ప్రముఖుల మధ్య జరిగిన ఈ సంభాషణ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Pawan Kalyan
Rajinikanth
Janasena
Telugu cinema
political news
Andhra Pradesh
AP Deputy CM
celebrity interaction
social media
political storm

More Telugu News