Delhi Crime: తల్లిపై కొడుకు పైశాచికం.. పాత సంబంధాలకు శిక్ష అంటూ దారుణం!

Delhi Crime Son Arrested for Raping Mother Blaming Past Affairs
  • ఢిల్లీలో దారుణం.. 65 ఏళ్ల తల్లిపై అత్యాచారానికి పాల్పడిన కొడుకు
  • సౌదీ అరేబియా యాత్ర నుంచి తిరిగొచ్చాక రెండుసార్లు అఘాయిత్యం
  • చిన్న కుమార్తె ధైర్యంతో పోలీసులను ఆశ్రయించిన 65 ఏళ్ల బాధితురాలు
  • నిందితుడిని అరెస్ట్ చేసి విచారణ చేపట్టిన పోలీసులు
సభ్య సమాజం తలదించుకునే అత్యంత దారుణమైన ఘటన దేశ రాజధాని ఢిల్లీలో వెలుగుచూసింది. కన్నతల్లిపైనే ఓ కిరాతక కొడుకు అత్యాచారానికి పాల్పడ్డాడు. తన చిన్నతనంలో తల్లికి ఇతర సంబంధాలు ఉన్నాయనే పగతో, ఆమెను శిక్షించేందుకే ఈ పైశాచికానికి ఒడిగట్టినట్టు చెప్పడం తీవ్ర కలకలం రేపుతోంది. ఈ ఘోరానికి సంబంధించి 39 ఏళ్ల నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఢిల్లీలోని హౌజ్ ఖాజీ ప్రాంతంలో 65 ఏళ్ల బాధితురాలు తన భర్త, నిందితుడైన కొడుకు, 25 ఏళ్ల చిన్న కుమార్తెతో కలిసి నివసిస్తున్నారు. ఇటీవల ఈ కుటుంబం సౌదీ అరేబియాలో పుణ్యక్షేత్రాల పర్యటనకు వెళ్లింది. వారు అక్కడ ఉన్నప్పుడే నిందితుడు తన తండ్రికి ఫోన్ చేసి, వెంటనే తిరిగి రావాలని ఒత్తిడి చేశాడు. అంతేకాకుండా, తన తల్లికి విడాకులు ఇవ్వాలని, చిన్నప్పుడు ఆమెకు అక్రమ సంబంధాలు ఉండేవని ఆరోపించాడు.

ఈ నెల 1న కుటుంబం ఢిల్లీకి తిరిగి వచ్చిన వెంటనే నిందితుడి అరాచకం మొదలైంది. తల్లిని ఓ గదిలో బంధించి, బురఖా తొలగించమని బలవంతం చేసి, ఆమెపై దాడి చేసి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణంతో తీవ్ర ఆవేదనకు గురైన బాధితురాలు దగ్గర్లోనే ఉంటున్న తన పెద్ద కుమార్తె ఇంట్లో తలదాచుకున్నారు.

అయితే, ఆగస్టు 11న ఆమె తిరిగి సొంత ఇంటికి వచ్చారు. అయినప్పటికీ నిందితుడి ప్రవర్తనలో మార్పు రాలేదు. ఆగస్టు 14న తెల్లవారుజామున 3:30 గంటల సమయంలో మరోసారి తల్లిని గదిలోకి లాక్కెళ్లి అత్యాచారం చేశాడు. ఈసారి కూడా ఆమె పాత సంబంధాలకు శిక్ష విధిస్తున్నానని చెప్పాడు. ఈ దారుణాన్ని ఇక భరించలేని ఆ తల్లి తన గోడును చిన్న కుమార్తె వద్ద వెళ్లబోసుకున్నారు. ఆమె ఇచ్చిన ధైర్యంతో ఇద్దరూ కలిసి హౌజ్ ఖాజీ పోలీస్ స్టేషన్‌లో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 64 (అత్యాచారం) కింద కేసు నమోదు చేసి, నిందితుడిని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ఘటనపై లోతైన దర్యాప్తు జరుగుతోంది.
Delhi Crime
Delhi
Son arrested
Rape case
Mother
Sexual assault
Hauz Khazi
Crime news
India crime
Family dispute

More Telugu News