Melania Trump: పుతిన్ కు మెలానియా లేఖ

Melania Trump Writes Letter to Putin to Stop War
  • అమాయక చిన్నారుల ఆశలు చిదిమేయొద్దని విజ్ఞప్తి
  • భావితరాలను కాపాడేందుకు యుద్ధం ఆపేయాలన్న మెలానియా
  • ఆ పిల్లల చిరునవ్వులు మీరు మాత్రమే కాపాడగలరని వెల్లడి
రష్యా, ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధాన్ని నిలవరించాలంటూ అమెరికా ఫస్ట్ లేడీ మెలానియా ట్రంప్ పుతిన్ కు ఓ లేఖ రాశారు. అలస్కాలో జరిగిన భేటీలో డొనాల్డ్ ట్రంప్ తన భార్య రాసిన లేఖను పుతిన్ కు అందజేసినట్లు సమాచారం. ఈ లేఖలో ఉక్రెయిన్ పేరును ప్రస్తావించనప్పటికీ.. అక్కడ ప్రాణాలు కోల్పోతున్న చిన్నారులపై మెలానియా ఆందోళన వ్యక్తం చేశారు. అమాయక పిల్లల చిరునవ్వులను మీరు మాత్రమే కాపాడగలరని పుతిన్ కు విజ్ఞప్తి చేశారు.

యుద్ధాన్ని ఆపేయడానికి భావితరాల భవిష్యత్తు కలలను పరిగణనలోకి తీసుకోవాలని ఆమె కోరారు. భౌగోళిక సరిహద్దులు, రాజకీయ భావజాలాలకు పిల్లలు అతీతమని చెప్పారు. జన్మించిన ప్రాంతం కారణంగా చిరునవ్వును కోల్పోయి భయాందోళనల మధ్య జీవించాల్సి రావడం సరికాదన్నారు. యుద్ధంలో చిక్కుకున్న పిల్లల నవ్వును ఒంటరిగా పునరుద్ధరించాలని పుతిన్ను కోరారు. పిల్లల అమాయకత్వాన్ని కాపాడటం రష్యాకు సేవ చేయడం కంటే చాలా ఎక్కువేనని మెలానియా ట్రంప్ తెలిపారు.

Melania Trump
Putin
Russia Ukraine war
Melania Trump letter to Putin
Ukraine children
Donald Trump
US First Lady
Russia
War

More Telugu News