Indian Railways: సికింద్రాబాద్-తిరుపతి ప్రయాణికులకు శుభవార్త.. రెండు ప్రత్యేక రైళ్లు

Indian Railways Announces Special Trains Between Secunderabad and Tirupati
  • ప్రయాణికుల రద్దీ దృష్ట్యా రైల్వే శాఖ నిర్ణయం
  • నేడు, రేపు నడపనున్న సర్వీసులు
  • తిరుపతి నుంచి నేడు, సికింద్రాబాద్ నుంచి రేపు
  • మార్గమధ్యంలో పలు స్టేషన్లలో ఆగుతాయని ప్రకటన
సికింద్రాబాద్, తిరుపతి మధ్య ప్రయాణించే వారికి దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈ రెండు నగరాల మధ్య రెండు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు నేడు, రేపు ఈ ప్రత్యేక సర్వీసులు అందుబాటులో ఉంటాయని తెలిపింది.

నేడు తిరుపతి నుంచి సికింద్రాబాద్‌కు ప్రత్యేక రైలు (07097) బయలుదేరుతుంది. అలాగే, రేపు సికింద్రాబాద్ నుంచి తిరుపతికి మరో ప్రత్యేక రైలు (07098) అందుబాటులో ఉంటుందని దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో శ్రీధర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ప్రత్యేక రైళ్లు మార్గమధ్యంలో రేణిగుంట, రాజంపేట, కడప, యర్రగుంట్ల, తాడిపత్రి, గుంతకల్, ఆదోని, మంత్రాలయం రోడ్, రాయచూర్, కృష్ణ, యాద్గిర్, తాండూర్, వికారాబాద్, లింగంపల్లి, బేగంపేట్ స్టేషన్లలో ఆగుతాయని అధికారులు వివరించారు. ఈ మార్గంలో ప్రయాణించే వారు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని రైల్వే శాఖ సూచించింది.
Indian Railways
Secunderabad Tirupati trains
special trains
SCR
South Central Railway
passenger rush
Renigunta
Kadapa
Guntakal
railway announcement

More Telugu News