Sheikh Yusuf: గుంటూరులో దారుణం .. ఇద్దరు పిల్లలను చంపి ఆపై ఆత్మహత్య చేసుకున్న తండ్రి

Sheikh Yusuf Kills Children and Commits Suicide in Guntur
  • గుంటూరు సాయిబాబా కాలనీలో ఘటన
  • కుటుంబ కలహాలతో తన పిల్లలను తండ్రి షేక్ యూసఫ్ చంపిన వైనం
  • కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
గుంటూరు సాయిబాబా కాలనీలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాల కారణంగా ఓ తండ్రి ఇద్దరు పిల్లల పాలిట యముడయ్యాడు.

వివరాల్లోకి వెళితే.. షేక్ యూసఫ్ తన భార్యతో గొడవపడి, ఇద్దరు పిల్లలను తీసుకుని గుంటూరులోని తన సోదరి ఇంటికి వెళ్ళాడు. అక్కడ తన పిల్లలు హుస్సేన్, ఆరిఫ్‌లకు ఎలుకల మందు పెట్టి చంపి, ఆ తర్వాత అతను కూడా ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 
Sheikh Yusuf
Guntur
Suicide
Family Dispute
Children Killed
Sai Baba Colony
Andhra Pradesh Crime
Poison
Crime News
Guntur Crime

More Telugu News