Reddappagari Madhavi: 'కుర్చీ' వివాదంపై స్పందించిన కడప ఎమ్మెల్యే మాధవి

Reddappagari Madhavi responds to chair controversy
  • స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో కుర్చీ వివాదం
  • స్పందించిన కడప టీడీపీ ఎమ్మెల్యే మాధవి
  • అధికారుల కుటుంబ సభ్యులు ఉండటంతోనే నిల్చున్నా
  • వారిని లేపడం పద్ధతి కాదని భావించా
  • సోషల్ మీడియా చర్చపై వ్యంగ్యాస్త్రాలు
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా తనకు ప్రోటోకాల్ ప్రకారం కుర్చీ కేటాయించలేదంటూ జాయింట్ కలెక్టర్ పై కడప టీడీపీ ఎమ్మెల్యే రెడ్డప్పగారి మాధవి ఆగ్రహం వ్యక్తం చేసినట్టు వార్తలు రావడం తెలిసిందే. ఆ వేడుకలను నిలబడే వీక్షించిన మాధవి అనంతరం అక్కడ్నించి వెళ్లిపోయారు. అయితే, దీనిపై సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుండడం పట్ల మాధవి స్పందించారు. ఈ ఘటన వెనుక ఉన్న అసలు కారణాన్ని వివరిస్తూ ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. తాను అధికారుల కుటుంబ సభ్యులకు గౌరవం ఇవ్వాలనే ఉద్దేశంతోనే నిల్చున్నానని, ఇందులో ఎలాంటి వివాదం లేదని స్పష్టం చేశారు.

వివరాల్లోకి వెళితే, శుక్రవారం జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ కార్యక్రమానికి అధికారుల ఆహ్వానం మేరకు తాను హాజరయ్యానని మాధవి తెలిపారు. అయితే, తనకు కేటాయించిన ప్రదేశంలో అప్పటికే కొందరు అతిథులు కూర్చుని ఉన్నారని, వారు అక్కడి అధికారుల కుటుంబ సభ్యులేనని తాను గుర్తించినట్లు చెప్పారు. వారిని అక్కడి నుంచి లేపి తాను కూర్చోవడం సంస్కారం కాదని భావించి, కార్యక్రమం పూర్తయ్యే వరకు నిల్చునే ఉన్నానని వివరించారు. అనంతరం అక్కడి నుంచి నిశ్శబ్దంగా వెళ్లిపోయినట్లు తెలిపారు.

ఈ చిన్న విషయంపై సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చపై ఆమె తనదైన శైలిలో స్పందించారు. "ఈ చిన్న విషయంపై సోషల్ మీడియాలో అంత సమయం కేటాయించి పెద్ద చర్చ చేసిన అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు" అంటూ ఆమె వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. 
Reddappagari Madhavi
Kadapa
Kadapa MLA
Independence Day celebrations
chair controversy
Joint Collector
Andhra Pradesh politics
protocol
social media

More Telugu News